Friday, March 6, 2026
spot_imgspot_img

ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎ.ఎమ్.సి ఛైర్మ‌న్ న‌ర్రావాసు

Must read

విజ‌య‌వాడ‌ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మ‌న్ గా నియమితులైన గొల్ల‌పూడి గ్రామ టిడిపి అధ్య‌క్షుడు న‌ర్రావాసు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఎ.ఎమ్.సి ఛైర్మ‌న్ న‌ర్రావాసు టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి బొమ్మ‌సాని సుబ్బారావు, టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు గూడ‌పాటి ప‌ద్మ‌శేఖ‌ర్, నూత‌ల‌పాటి నార‌ద నేతృత్వంలో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను కలుసుకున్నారు. ఎ.ఎమ్.సి ఛైర్మ‌న్ గా నియ‌మితులైన న‌ర్రావాసు కి ఎంపి కేశినేని శివనాథ్ అభినంద‌న‌లు తెల‌ప‌టంతోపాటు శాలువాతో స‌త్క‌రించారు. తమపై నమ్మకంతో విజ‌యవాడ‌ ఎ.ఎమ్.సి ఛైర్మ‌న్ గా అవకాశం కల్పించినందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)కు న‌ర్రా వాసు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!