వాహనదారులారా తస్మాత్ జాగ్రత్త.. టోల్ ఎగవేస్తే ఐదు రెట్లు భారీ జరిమానా.. కేంద్రం షాకింగ్ రూల్స్!

Must read

Toll Plaza Rules: జాతీయ రహదారులపై ఎలాంటి ఆటంకాలు, సుదీర్ఘ క్యూలైన్లు లేకుండా వాహనాలు రయ్‌మని దూసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ వ్యవస్థను ప్రవేశపెడుతోంది. బారియర్లు లేని ఈ అత్యాధునిక విధానంలో ప్రయాణికులకు(Toll Plaza Rules) సమయం ఆదా అవుతున్నప్పటికీ, కొందరు వాహనదారులు టోల్ ఛార్జీలను ఎగవేసేందుకు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి మోసాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ (MoRTH) తాజాగా అత్యంత కఠిన నిబంధనలను ప్రకటించింది.

నంబర్ ప్లేట్లు దాచినా, ఫాస్టాగ్ ప్రదర్శించకున్నా 5 రెట్లు ఫైన్:

ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్ టోల్ ప్లాజాల వద్ద రుసుము చెల్లింపు నుంచి తప్పించుకునేందుకు ఉద్దేశపూర్వకంగా వాహన నంబర్ ప్లేట్లను మరుగుపరిచినా, ట్యాంపరింగ్ చేసినా లేదా విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్‌ను స్పష్టంగా ప్రదర్శించకున్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై అసలు చెల్లించాల్సిన వాస్తవ టోల్ ఫీజుకు ఏకంగా ఐదు రెట్లు (5X) జరిమానా విధిస్తామని కేంద్ర మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది.

అత్యాధునిక హై-టెక్ నిఘా.. తప్పించుకోవడం ఇక అసాధ్యం:

టోల్ గేట్ల వద్ద బారియర్లు, సిబ్బంది లేకపోవడంతో ఎవరూ గుర్తించలేరని భావిస్తే పొరపాటేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. టోల్ ఛార్జీలను ఎగవేసే వాహనాలను క్షణాల్లో పసిగట్టేందుకు అత్యాధునిక ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు, సెన్సార్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు శాఖ వెల్లడించింది. కాబట్టి హైవే ప్రయాణికులు అనవసరపు జరిమానాల బారిన పడకుండా నిబంధనలు తప్పక పాటించాలని సూచించింది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article