కొత్త ఫోన్, ల్యాప్‌టాప్ కావాలా? బ్లాక్ ఫ్రైడే సేల్‌లో రూ.57 వేల వరకు డిస్కౌంట్లు.. ఈ ఆఫర్లు మిస్ కావద్దు!

Must read

  • స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా?
  • ఐఫోన్ 17 ప్రో నుంచి శాంసంగ్ S26 అల్ట్రా వరకు ఆఫర్లు
  • బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్, శాంసంగ్ ఫోన్లపై భారీ తగ్గింపు
  • ఐఫోన్ 17, గెలాక్సీ S25, మ్యాక్‌బుక్‌పై అదిరిపోయే ధరలు

Black Friday Sale 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మంచి ల్యాప్‌టాప్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. బ్లాక్ ఫ్రైడే సేల్ (Black Friday Sale 2026) సందర్భంగా ప్రముఖ రిటైల్ సంస్థలు అదిరిపోయే డిస్కౌంట్లతో ముందుకొచ్చాయి. స్మార్ట్‌ఫోన్లు, గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, ఆపిల్ ప్రొడక్టులపై భారీ ధర డిస్కౌంట్లను అందిస్తున్నాయి. క్రోమా, విజయ్ సేల్స్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్‌పై ఓ లుక్కేద్దాం..

క్రోమాలో ఐఫోన్, శాంసంగ్ ఫోన్లపై ఆఫర్లు :
క్రోమాలో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా (12GB+256GB) ధర రూ.1,69,999 నుంచి రూ.1,54,999కు తగ్గింది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఆపిల్ ఐఫోన్ 17 ప్రో (256GB) ధర రూ.1,34,900 నుంచి రూ.1,26,990కు చేరింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుపై 6 నెలల నో కాస్ట్ ఈఎంఐతో రూ.4వేలు తగ్గింపు లభిస్తుంది. ఆపిల్ మ్యాక్ బుక్ నియో (512GB) కూడా రూ.89,900 నుంచి రూ.82,990కు అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అదనపు ఆఫర్లు పొందవచ్చు..

విజయ్ సేల్స్‌లో గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై తగ్గింపు :
గేమింగ్ ల్యాప్‌టాప్ కొనాలనుకునేవారికి విజయ్ సేల్స్‌లో అద్భుతమైన డీల్స్ ఉన్నాయి. హెచ్‌పీ విక్టస్ ల్యాప్‌టాప్ ధర రూ.1,70,569 నుంచి రూ.1,20,999కు తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుపై రూ.4వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే అసూస్ టీయూఎఫ్ A15 ధర రూ.1,61,990 నుంచి రూ.1,04,990కు తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై మరో రూ.6వేలు డిస్కౌంట్ అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్, గెలాక్సీ డిస్కౌంట్లు :
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ ధర రూ.1,04,999 నుంచి రూ.70,999కు తగ్గింది. ఫ్లిప్ కార్ట్ యాక్సస్ క్రెడిట్ కార్డుపై రూ.3,550 తగ్గింపు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై అదనపు బెనిఫిట్ పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 17 ధర కూడా రూ.99,900 నుంచి రూ.89,100కు తగ్గింది. కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి ఈ సేల్ బెస్ట్ ఆప్షన్.. అయితే, ఏదైనా ఫోన్ కొనే ముందు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, స్టాక్ వివరాలు చెక్ చేసుకోండి..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article