Siddharth Galla : మహేష్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో తనయుడు సిద్దార్థ్ గల్లా ఇటీవల కొన్ని రోజుల క్రితం తను ప్రేమించిన సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ ని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి నిశ్చితార్థం ఫోటోలు, ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఈ జంట వివాహం నేడు ఘనంగా జరిగింది. వేరే దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కేవలం ఘట్టమనేని, గల్లా కుటుంబాలు, అమ్మాయి తరపు బంధువుల మధ్యే ఈ వివాహం జరిగింది. వీరి పెళ్ళి ఫోటోలను మహేష్ అక్క మంజుల ఘట్టమనేని సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ అవ్వగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే మేనల్లుడి పెళ్ళిలో మహేష్ బాబు ఎక్కడా కనిపించకపోవడంతో పెళ్ళికి రాలేదా? మహేష్ ఎక్కడ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సిద్దార్థ్ గల్లా – హైన్ కిమ్ పెళ్లి వేడుకల నుంచి మరిన్ని ఫోటోల కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.




