ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి సినిమా అప్డేట్.. అనిల్ క్లోజ్ ఫ్రెండ్, డైరెక్టర్ కృష్ణ కామెంట్స్ వైరల్..

Must read

NTR Anil Ravipudi : అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబోపై అంచానాలు నెలకొన్నాయి. అదుర్స్ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. అయితే తాజాగా ఈ కాంబో సినిమాపై దర్శకుడు, అనిల్ క్లోజ్ ఫ్రెండ్ కృష్ణ కామెంట్స్ చేసారు.

అనిల్ రావిపూడి మొదటి సినిమా పటాస్ నుంచి కృష్ణ అతనితో కలిసి పనిచేస్తున్నాడు. రచయితగా, సహాయ దర్శకుడిగా, ఎగ్జిగ్యూటివ్ నిర్మాతగా కృష్ణ అనిల్ రావిపూడి సినిమాలకు పనిచేసాడు. కృష్ణ ఇప్పుడు దర్శకుడిగా, నటుడిగా మారి హై అనే సినిమాతో రాబోతున్నాడు. అనిల్ కూడా అనేక సార్లు కృష్ణ తనకు బాగా క్లోజ్ అని, తన రైటింగ్ లో కృష్ణ హెల్ప్ ఉంటుందని తెలిపాడు. హై సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడుతూ కృష్ణ ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి సినిమాపై మాట్లాడారు.

కృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి సినిమా 2028కి వస్తుందా లేక 2029కి వస్తుందా నాకు కూడా తెలియదు. మాకు కూడా అది ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంది. అది అనిల్ క్లారిటీ ఇవ్వాలి. అసలు పటాస్ సినిమా సమయంలోనే ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి అనుకున్నారు కానీ కుదర్లేదు. ఎన్టీఆర్, అనిల్ రావిపూడి ఇద్దరి ఎనర్జీలు కలిస్తే వేరే లెవల్ ఉంటుంది. ఇది ఫుల్ ఎంటర్టైనర్ మాత్రమే కాలేదు క్రేజీ సినిమా అవుతుంది.

నేను కూడా ఎప్పట్నుంచో వీళ్లిద్దరి సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ఇటీవల స్టార్ హీరోలంతా పాన్ ఇండియా అని ఫ్యామిలీ సినిమాలు వదిలేసారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి ఫ్యామిలీ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు అని అన్నారు. దీంతో అందరూ ఊహించినట్టే ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి సినిమా 2028 సంక్రాంతికి ఉంటుందా? 2029 సంక్రాంతికి ఉంటుందా అనేది క్లారిటీ రాలేదు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article