ఏపీ పంచాయతీ ఎన్నికల్లో భారీ మార్పులు.. ఇంక్ గుర్తు చిటికెన వేలిపైన.. SEC కీలక ఉత్తర్వులు!

Must read

AP Panchayat Election: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి గందరగోళానికి తావులేకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠా కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లకు ఎడమ చేతి చిటికెన వేలు (Little Finger) పై చెరగని సిరా (Indelible Ink) గుర్తు వేయాలని పోలింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నవంబర్ 13వ తేదీన ఉత్తర్వుల నంబర్ 1818/SEC-B2/2026ను విడుదల చేసినట్లు తెలిపారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసిన రోజు నుంచే ఈ సిరా గుర్తు మార్పు నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

చూపుడు వేలు, మధ్య వేలుపై పాత సిరా గుర్తుల నేపథ్యం:

సాధారణంగా ప్రతి ఎన్నికల (AP Panchayat Election)సమయంలోనూ ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా చుక్క వేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అయితే, ఇటీవల ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు వేశారు. దీనికి తోడు కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ నిర్వహించాల్సి రావడంతో, ఆయా ప్రాంతాల్లోని ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలుపై కూడా సిరా గుర్తు వేశారు.

గందరగోళం నివారణకే ఈ ప్రత్యేక నిర్ణయం:

తక్కువ వ్యవధిలోనే వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో, గత ఎన్నికల సమయంలో వేసిన సిరా గుర్తులు ఓటర్ల వేళ్లపై ఇంకా చెరిగిపోకుండా అలాగే ఉన్నాయి. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ పాత సిరా గుర్తుల వల్ల పోలింగ్ సిబ్బందికి తికమక ఏర్పడకుండా, అలాగే దొంగ ఓట్లకు ఎలాంటి అవకాశం లేకుండా అడ్డుకట్ట వేసేందుకే ఎస్ఈసీ ఈ మార్పు చేశారు. ఈ కొత్త విధానంపై పోలింగ్ కేంద్రాల సిబ్బందికి తగిన శిక్షణ, సూచనలు అందించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article