నన్ను కూడా సీఎంని చేస్తారా? నల్గొండ గద్దర్ తో శర్వానంద్ కామెంట్స్ వైరల్..

Must read

Sharwanand : ప్రముఖ ఫోక్ సింగర్ నల్గొండ గద్దర్ నరసన్న ప్రైవేట్, సినిమా సాంగ్స్ తో పాటు అనేక రాజకీయ పార్టీలకు కూడా పాటలు పాడారు. సీఎం రేవంత్ కి ఎన్నికల ప్రచారంలో నల్గొండ గద్దర్ పాడిన మూడు రంగాల జెండా సాంగ్ విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల నల్గొండ గద్దర్ శర్వానంద్ భోగి సినిమాలో పాట పాడారు. నవంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు తాజాగా మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్ కి శర్వానంద్, డింపుల్ హయతి తో సహా మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో శర్వానంద్ మాట్లాడుతూ నల్గొండ గద్దర్ తో ఆసక్తికర కామెంట్స్ చేసారు.

శర్వానంద్ మాట్లాడుతూ.. నర్సన్న మీరు చాల మందిని సీఎం చేసారంట. నన్ను కూడా చేస్తారా ఏంటి. ఇప్పుడు పాట పాడారు నా సినిమాకు. అయిపోతానేమో విజయ్ లాగా సీఎం నేను అని అన్నారు. దానికి నరసన్న.. అయిపోతారేమో చెప్పలేము, భవిష్యత్తులో అయితారేమో దేవుడు అనుకుంటే అవుతారు అని అన్నారు. దాంతో శర్వానంద్.. మనం నటుడిగా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉందాం చాలు అని అన్నారు. దీంతో సీఎం చేస్తారా అని శర్వానంద్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article