Rajamouli-Prabhas : వారణాసి మూవీ పూర్తి అయిన తర్వాత రాజమౌళి చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో జక్కన్న మరో ప్రాజెక్టు చేయబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఛత్రపతి, బాహుబలి బిగినింగ్, బాహుబలి-2 మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాల్గో పిక్చర్ కోసం కసరత్తు జరుగుతోందట.
బాహుబలికి ముందు రాజమౌళి డార్లింగ్‌కు చెప్పిన రెండు కథల్లో ఒకటి పూర్తిగా యాక్షన్ డ్రామా అని చెబుతున్నారు. మరొకటి బాహుబలి స్టోరీ అని అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోవడంతో పెండింగ్‌లో ఉండిపోయిని ఆ కథను మళ్లీ పట్టాలెక్కించాలని రాజమౌళి భావిస్తున్నారట.
దర్శకధీరుడు రాజమౌళి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోందంటూ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు వారణాసి తర్వాత రాజమౌళి మరోసారి ప్రభాస్‌తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం మొదలైంది.
మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం అంగీకరించిన సినిమాలన్నింటినీ 2028 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారని, అందుకే కొత్త ప్రాజెక్టులకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని టాక్. ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్టు ప్రభాస్‌తోనే ఉండబోతోందా.? లేక డార్లింగ్ షెడ్యూల్ ఫ్రీ అయ్యేలోపు మరేదైనా సినిమాలు చేస్తారా అనేది వేచి చూడాలి మరి.




