సూపర్ హిట్ సినిమా.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఎప్పుడు? ఎక్కడ?

Must read

Garividi Lakshmi : ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా ఆనంది టైటిల్ రోల్ లో తెరకెక్కిన సినిమా గరివిడి లక్ష్మి. అక్టోబర్ 17న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. రాగ్ మయూర్, నరేష్, రాశి, ఎల్బీ శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, అంకిత్ కొయ్య, శరణ్య ప్రదీప్, షకలక శంకర్, కంచరపాలెం కిషోర్, నితిన్ ప్రసన్న, వైవా రాఘవ.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాణంలో గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్స్ లో బుర్రకథలు, ఫోక్స్ సాంగ్స్ తో, ఆనంది, రాజ్ మయూరి నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.

గరివిడి లక్ష్మి సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబర్ 26 అంటే రేపు గురువారం నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో మిస్ అయినవాళ్లు ఈ సినిమాని ఓటీటీలో చూసేయండి..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article