- కరోనా మళ్లీ విజృంభిస్తుందా?
- కరోనా కొత్త వేరియంట్ PJ.2.1 ఎంట్రీ
- 18 దేశాల్లో కరోనా కొత్త వైరస్ జాడలు..
- కొత్త వేరియంట్‌పై WHO కీలక ప్రకటన
వ్యాక్సిన్లు పనిచేస్తాయా? :
ఈ కొత్త వేరియంట్‌పై ఇప్పటికే పలు ప్రయోగశాల స్థాయి అధ్యయనాలు జరిగాయి. ఎల్‌పీ.8.1, ఎక్స్ఎఫ్‌జీ వేరియంట్లకు అనుగుణంగా రూపొందించిన వ్యాక్సిన్ల ద్వారా ఉత్పత్తయ్యే యాంటీబాడీలు పీజే.2.1ను కూడా ఎదుర్కోగలిగినట్లు ప్రాథమిక ఫలితాలు సూచిస్తున్నాయి. ఎక్స్ఎఫ్‌జీ-అడాప్టెడ్ వ్యాక్సిన్ తీసుకున్న 22 మందిపై చేసిన అధ్యయనంలో 14 రోజుల తర్వాత యాంటీబాడీ స్థాయిలు 2.8 రెట్లు పెరిగాయి.
భయపడాల్సిన అవసరం ఉందా? :
ప్రస్తుతానికి ఈ వేరియంట్ వల్ల తీవ్రమైన అనారోగ్యం పెరుగుతుందని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. WHO అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దీని అదనపు ప్రజారోగ్య ముప్పు తక్కువగానే ఉంది. అయితే, వ్యాధి తీవ్రతపై మరింత పరిశోధన అవసరం..
జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. కొత్త వేరియంట్‌పై ఆందోళన కన్నా అప్రమత్తతే చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

