ఐఫోన్ ధరకు పడిపోయిన బంగారం, వెండి రేట్లు.. అదే డబ్బుతో ఎన్ని తులాలు కొనొచ్చంటే!

Must read

  • బంగారం, వెండి కొనాలనుకునేవారికి అలర్ట్..
  • ఐఫోన్ ధరకు పడిపోయిన బంగారం, వెండి రేట్లు
  • ఐఫోన్ 17 ప్రో ధరలోనే 10 గ్రాముల బంగారం

ఇక వెండి పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది.. కిలో వెండి ధర రూ.6,169 తగ్గి రూ.1,63,533కు చేరింది. దాదాపు 3.63 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది గరిష్ఠ ధరలతో పోలిస్తే.. బంగారం సుమారు 27.5 శాతం, వెండి దాదాపు 61 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది..

ఐఫోన్ ధరతో దగ్గరగా బంగారం, వెండి :
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1.31 లక్షల నుంచి రూ.1.38 లక్షల మధ్య ఉంది. ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధరకు దగ్గరగా ఉంది. అలాగే కిలో వెండి ధర కూడా ఐఫోన్ 18 ప్రో బేస్ మోడల్ ధరతో దాదాపు సమానంగా కనిపిస్తోంది..

బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? :
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు, డాలర్ బలపడటం బంగారం, వెండిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. మరోవైపు వెండికి సంబంధించిన పారిశ్రామిక డిమాండ్ బలహీనంగా ఉండటం కూడా ధరల తగ్గుదలకు కారణమవుతోంది. అయితే, ధరలు తగ్గాయని వెంటనే కొనుగోలు నిర్ణయం తీసుకోవద్దు.. స్థానిక మార్కెట్ ధరలు, మేకింగ్ ఛార్జీలు, పన్నులను కూడా చెక్ చేయడం ఎంతైనా మంచిది..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!