Homeతెలంగాణరేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ బీమా అందరికీ కాదు.. ఈ అర్హతలు ఉంటేనే ఛాన్స్..!

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ బీమా అందరికీ కాదు.. ఈ అర్హతలు ఉంటేనే ఛాన్స్..!

  • తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్..
  • ఇందిరమ్మ బీమా కోసం కొత్త నిబంధనలు
  • మీ కుటుంబానికి రూ.లక్షల భరోసా కావాలా?
  • ఇందిరమ్మ బీమాకు ఇలా అప్లయ్ చేయండి

రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? :
అర్హులైన వారు సమీపంలోని రిజిస్టర్ కేంద్రానికి వెళ్లి తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవచ్చు. బీమా పొందాలనుకునే వ్యక్తి స్వయంగా హాజరై నామినీ వివరాలు ఇవ్వాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ ఫోన్ వెంట తీసుకెళ్లాలి. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో వెరిఫికేషన్ తప్పనిసరి.

వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. ఆధార్‌లో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే ముందుగా సరిచేయించుకోవాలి. అలాగే, రేషన్ కార్డుకు ఈ-కేవైసీ పూర్తి చేయని వారు ముందుగా ఆ ప్రాసెస్ పూర్తి చేయాలి.

ముఖ్యమైన తేదీలివే :
నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు కేంద్రానికి రాలేకపోతే సిబ్బంది ఇంటికే వెళ్లి వివరాలు రిజిస్టర్ చేస్తారు. నామినీగా ఇద్దరిని ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. వారికి అందాల్సిన వాటాను కూడా ముందుగానే తెలియజేయాలి..

కుటుంబానికి అండగా నిలిచే సంపాదనపరుడికి బీమా రక్షణ కల్పించాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు అర్హతలు, ఆధార్, రేషన్ కార్డు వివరాలు సరిచూసుకోవడం బెటర్..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments