Ego Raja : ఆది సాయి కుమార్, తమిళ నటుడు సతీష్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా ఈగో రాజా. ఎస్జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మాణంలో గురు శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి బైలింగ్వల్ సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ అవ్వగా తాజాగా టీజర్ రిలీజ్ చేసారు. మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియా వేదికగా ఈగో రాజా టీజర్‌ను విడుదల టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ టీజర్ చూస్తుంటే.. విలన్ లోన్ యాప్ కంపెనీ నడుపుతుంటాడు. మిడిల్ క్లాస్ వాళ్లకు యాప్ లో డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేస్తాడు. సతీష్ ఓకే అమిడిల్ కేస్ వాడిగా ఈ లోన్ యాప్ ద్వారా నష్టపోయినట్టు, ఆది లోన్ యాప్ లో డబులు రికవరీ చేసే రౌడీల అకనిపించాడు. దీంతో ఈ సినిమా ప్రస్తుతం సమాజంలో లాన్ యాప్స్ వల్ల జరుగుతున్న ఇబ్బందులను, సమస్యలను చూపించబోతున్నట్టు తెలుస్తుంది.
మీరు కూడా ఈగో రాజా టీజర్ చూసేయండి..

