పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. హువావే సొంత కిరిన్ 9030S చిప్‌సెట్‌ను ఇందులో అమర్చారు. గరిష్ఠంగా 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ అందించారు. హార్మోనీOS 7 ఏఐ పాయినీర్ ఎడిషన్ ద్వారా వచ్చిన తొలి ఫోన్‌గా కంపెనీ చెబుతోంది.
కెమెరా, బ్యాటరీ స్పెషాలిటీ :
ఫొటోగ్రఫీ కోసం 200MP మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇందులో 3.7x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కూడా ఉంది. అయితే, అల్ట్రావైడ్ కెమెరా మాత్రం అందించలేదు. ఈ ఫోన్లో మరో స్పెషాలిటీ 7000mAh భారీ బ్యాటరీ.
దీనికి 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ అదనపు ఫీచర్‌గా ఉంది. మొత్తంగా భారీ బ్యాటరీ, హై రిజల్యూషన్ కెమెరా, స్పెషల్ డిస్ప్లే డిజైన్‌తో హువావే ఓస్టా O1 ప్రో ప్రీమియం ఫోన్ సెగ్మెంట్లో ఆసక్తి రేపుతోంది..

