Homeటెక్నాలజీలావా కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 950 గంటల స్టాండ్‌బై.. ధర...

లావా కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 950 గంటల స్టాండ్‌బై.. ధర జస్ట్..!

  • తక్కువ ధరలో లావా స్మార్ట్ 4 ప్రో ఫోన్
  • 7,000mAh బ్యాటరీ, 90Hz డిస్‌ప్లే
  • రూ. 10,999కే లావా కొత్త ఫోన్ మీ సొంతం

డిస్‌ప్లే, కెమెరాలు :
లావా స్మార్ట్ 4 ప్రోలో 6.75 అంగుళాల HD+ నాచ్ డిస్‌ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. UNISOC T610 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఫోన్‌లో 4GB ర్యామ్, మరో 4GB వర్చువల్ ర్యామ్ అందించారు. 64GB స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 512GB వరకు పెంచుకోవచ్చు. ఫొటోల కోసం బ్యాక్ సైడ్ 13MP కెమెరా, సెల్ఫీల కోసం స్క్రీన్ ఫ్లాష్‌తో 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్, ఇతర ఫీచర్లు :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. యాడ్స్, అనవసరమైన యాప్‌లు ఉండవని కంపెనీ చెబుతోంది. సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, MIL-STD-810H డ్రాప్ అండ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి. రెండేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని లావా చెబుతోంది.

అంతేకాదు, హ్యాండ్‌సెట్‌పై ఏడాది వారంటీ, యాక్సెసరీలపై 6 నెలల వారంటీతో పాటు ఫ్రీ సర్వీస్@హోమ్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. మొత్తంగా లాంగ్ బ్యాటరీ బ్యాకప్ కోరుకునేవారికి ఈ ఫోన్ బడ్జెట్ ఆప్షన్‌ అని చెప్పొచ్చు..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments