ఇక ఇష్టారాజ్యం కుదరదు.. బియ్యం ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

Must read

  • బియ్యం కొనేవారికి గుడ్ న్యూస్.. కిలో ధరలు ఇవే.. మించితే అంతే
  • బియ్యం వ్యాపారులకు షాక్.. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు
  • అక్రమ నిల్వలు, తూకాల్లో మోసాలకు చెక్.. రంగంలోకి పౌరసరఫరాల శాఖ

Telangana Rice Prices : తెలంగాణ రాష్ట్రంలో బియ్యం ధరలు పెంచుతూ సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న వ్యాపారులకు పౌరసరఫరాల శాఖ గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది.

మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించడం, బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, తూకాల్లో మోసాలకు పాల్పడటం వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అధికారులు రంగంలోకి దిగారు. ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

వారం పాటు అధికారుల తనిఖీలు :
పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. దాంతో అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5 వరకు వారం రోజుల పాటు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సంయుక్త దాడులు నిర్వహించారు.
సంబంధిత శాఖల అధికారులు కలిసి బియ్యం వ్యాపార సంస్థలు, గోదాములు, దుకాణాల్లో తనిఖీలు చేపట్టి అక్రమ నిల్వలు, అధిక ధరల వసూళ్లు, తూకాల్లో మోసాలపై నిఘా పెట్టారు..

Read Also : 

బియ్యంపై ప్రభుత్వ నిర్దిష్ట ధరలివే :
ముఖ్యంగా కొన్ని రకాల బియ్యం ధరలు ఇష్టానుసారంగా పెంచి అమ్మకుండా ప్రభుత్వం గరిష్ఠ ధరలను నిర్దేశించింది. ఇందులో భాగంగా BPT/KNM రకం బియ్యం కిలో ధర రూ.66కు మించకూడదు. RNR (తెలంగాణ సోనా) బియ్యం కిలో రూ.74గా, HMT/JSR రకం బియ్యం కిలో రూ.79గా ధర పరిమితులు నిర్ణయించారు.

ఈ ధరలకు మించి బియ్యం అమ్మితే సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ప్రతి బియ్యం దుకాణంలో విక్రయించే రకాల పేర్లు, వాటి ధరలు స్పష్టంగా కనిపించేలా ధరల పట్టికతో బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. బియ్యం కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు కూడా ధరలు, తూకాలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!