ఓటర్ల జాబితాలో మీ పేరు లేదా? మళ్లీ అప్లయ్ చేసుకోవచ్చు.. ఈసీ కీలక ఆదేశాలు

Must read

  • ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. జాబితాలో పేరు లేకపోయినా అవకాశం
  • అర్హులైన ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు మళ్లీ సమర్పించవచ్చు
  • ముసాయిదా జాబితాలో పేరు రాకపోయినా తుది జాబితాలో మళ్లీ ఛాన్స్

SIR Voter Revision : ఓటరు జాబితాలో పేరు లేదని ఆందోళన చెందుతున్నారా? అయితే, మీకో గుడ్‌న్యూస్. ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులైన వారికి కేంద్ర ఎన్నికల సంఘం మరో ఛాన్స్ కల్పించింది.

ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన వారు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో ఓటర్లకు కొంత ఊరట లభించినట్లయింది..

ఎవరెవరు మళ్లీ అప్లయ్ చేసుకోవచ్చు? :
గతంలో గైర్హాజరు, వలస వెళ్లినవారు, మరణించినవారు, డూప్లికేట్ ఓటర్లు వంటి కేటగిరీల్లో గుర్తించి జాబితాలో పేర్లు చేర్చని వారి వివరాలను మరోసారి పరిశీలించనున్నారు. ముఖ్యంగా ఎన్యుమరేషన్ ఫారాలు అందకపోవడం లేదా సమర్పించలేకపోవడం వల్ల పేరు నమోదు కాని అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఈ నిర్ణయంతో ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, నాగాలాండ్ రాష్ట్రాలకు వర్తించనుంది. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల్లో సంబంధిత ఓటర్ల జాబితాలను మళ్లీ డిస్ ప్లే చేయాలని ఈసీ ఆదేశించింది. ఓటర్ల పేర్లు ఎందుకు తొలగించారో కారణాలను కూడా వెల్లడించనున్నారు..

Read Also : 

ఇంట్లోనే ఉండి ఫారం పొందొచ్చు :
ఈ ప్రక్రియను మరింత ఈజీ చేసేందుకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి అర్హులైన ఓటర్లకు ఫారాలు అందించనున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా కూడా ఫారాలు పంపించే వెసులుబాటు కల్పించారు. పాత ఈపీఐసీ నంబర్‌తో ఈసీ వెబ్‌సైట్ లేదా (ECINET) యాప్ ద్వారా ఫారాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇక రాష్ట్రంలోనే మరో ప్రాంతానికి ఇల్లు మార్చుకున్నవారు కొత్త అడ్రస్ వివరాలతో అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. ఇల్లు లేని వారికి అడ్రస్ వెరిఫికేషన్ డాక్యుమెంట్లు లేకపోయినా బీఎల్ఓ క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా అర్హతను నిర్ధారించే అవకాశం ఉంది..

అయితే, ఇప్పటికే ఫారం-6 ద్వారా కొత్త ఓటరు నమోదుకు అప్లయ్ చేసుకున్నవారు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వాల్సిన పనిలేదు. మొత్తానికి ఓటర్ల జాబితాలో పేరు లేదని నిరాశ చెందాల్సిన అవసరం ఉండదు. అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును కాపాడుకోవచ్చు..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!