జియో యూజర్లకు పండగే.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్.. వారికి మాత్రమే..!

Must read

  • జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్..
  • జియో రూ.123 ప్లాన్ ఎలా పొందాలి?
  • ఫోన్ కాల్స్, డేటా, SMS బెనిఫిట్స్

Jio Cheapest Plan : అసలే మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగిపోయాయి.. ప్రతి నెలా ఫోన్ రీఛార్జ్ కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడం ఇబ్బందిగా మారుతోంది. ఇలాంటి సమయంలో తక్కువ ధరలోనే కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందించే ప్లాన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. ఇప్పుడు రిలయన్స్ జియో చీపెస్ట్ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది.

కేవలం రూ.123తో 28 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఈ ప్లాన్ అందరికీ వర్తించదు.. మరి ఎవరికి వర్తిస్తుంది? రీఛార్జ్ ప్లాన్ (Jio Cheapest Plan) బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రూ.123 ప్లాన్‌లో ఏం వస్తాయంటే? :
జియో రూ.123 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. రోజుకు 500MB హైస్పీడ్ డేటా, మొత్తం 14GB డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ బెనిఫిట్ కూడా ఉంటుంది. మొత్తం 300 SMS కూడా ఫ్రీగా పొందవచ్చు. డేటా లిమిట్ తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64Kbpsకు తగ్గుతుంది. అలాగే JioSaavn, JioTV సేవలకు కూడా యాక్సెస్ పొందవచ్చు..

Read Also : 

అందరికీ ఈ ప్లాన్ వర్తించదు :
ఈ రీఛార్జ్ ప్లాన్ సాధారణ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వర్తించదు.. ప్రత్యేకంగా జియో ఫోన్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే.. జియో ఫీచర్ ఫోన్ వాడుతున్నవారికే ఈ ప్లాన్ వర్తిస్తుంది.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో జియో సిమ్ వాడేవారు ఈ ప్లాన్‌ను ఎంచుకునే ముందు తమ నంబర్‌కు అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోండి..

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరో ఆప్షన్ :
సాధారణ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం రూ.189 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, మొత్తంగా 2GB డేటా, 300 SMS బెనిఫిట్స్ పొందవచ్చు. అలాగే,
తక్కువ ఖర్చుతో రీఛార్జ్ చేసేవారు తమ ఫోన్‌కు ఏ ప్లాన్ అవసరమో డిసైడ్ అవ్వాలి.. కేవలం చీపెస్ట్ ప్లాన్ కోసం రీఛార్జ్ చేయకుండా బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో ముందుగానే చెక్ చేయడం బెటర్..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!