- చీరాలలో కాంగ్రెస్ జోరు.. స్థానిక ఎన్నికల్లో తొలి విజయం..
- కాంగ్రెస్ సత్తా.. టీడీపీ 13, హస్తం 4, వైసీపీ 3.. విజేతలు వీరే
- టీడీపీ వర్సెస్ కాంగ్రెస్.. చీరాల కౌంటింగ్‌లో ఆసక్తికర పోరు.. వైసీపీకి షాక్
Chirala Bypoll Results : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చీరాల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీలకు, వైసీపీకి మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా.. చీరాలలో కాంగ్రెస్ పార్టీ కూడా తన సత్తా చాటుతోంది.
మున్సిపల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవడమే కాకుండా, ఇప్పటివరకు 4 వార్డుల్లో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు టీడీపీ మాత్రం అత్యధిక స్థానాలు గెలుచుకుని ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది..
నిజానికి ఈ నెల 1న రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో పోలింగ్ జరిగింది. నవంబర్ 3న ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా, తుపాను ప్రభావంతో చీరాలలో భారీ వర్షం కురిసింది. దీంతో ఎన్నికల సంఘం ఇక్కడ కౌంటింగ్‌ను వాయిదా వేసింది. తాజాగా నిర్వహించిన ఓట్ల లెక్కింపుతో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి..
తొలుత 25వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించడం విశేషం.. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలవగా, వైసీపీ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. 22వ వార్డులో టీడీపీ అభ్యర్థి గెలుపొందగా.. కాంగ్రెస్ రెండో స్థానంలో, వైసీపీ మూడో స్థానంలో నిలిచాయి.
Read Also :
ఇక వార్డుల వారీగా ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే.. 1వ వార్డులో కాంగ్రెస్, 6వ వార్డులో టీడీపీ, 9వ వార్డులో టీడీపీ, 13వ వార్డులో టీడీపీ, 14వ వార్డులో టీడీపీ, 18వ వార్డులో వైసీపీ, 22వ వార్డులో టీడీపీ, 25వ వార్డులో కాంగ్రెస్, 26వ వార్డులో టీడీపీ, 30వ వార్డులో టీడీపీ, 41వ వార్డులో టీడీపీ విజయం సాధించాయి.
తదుపరి ఫలితాల్లో 21వ వార్డు, 33వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. 29వ, 37వ, 38వ, 41వ, 42వ వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. 34వ వార్డును వైసీపీ కైవసం చేసుకుంది.
మొత్తంగా ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం.. చీరాలలో టీడీపీ 13 వార్డుల్లో, కాంగ్రెస్ 4 వార్డుల్లో, వైసీపీ 3 వార్డుల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ 4 స్థానాలు గెలుచుకోవడం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
మరోవైపు టీడీపీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. చీరాలలో కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుండటంతో మిగిలిన ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది..


