- CBSE విద్యార్థులకు బిగ్ అలర్ట్..
- 10, 12వ తరగతి పరీక్షలు ఎప్పుడంటే?
- ఫిబ్రవరి 16 నుంచి బోర్డు పరీక్షలు..
- CBSE పరీక్షలకు కౌంట్‌డౌన్ షురూ..
CBSE Board Exams 2027 : పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు రెడీ అవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది.
2027 ఫిబ్రవరి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఇప్పటికే పరీక్షల కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టిన (CBSE Board Exams 2027) లక్షలాది మంది విద్యార్థులు తమ చదువుపై మరింత దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చేసింది.
10వ తరగతి పరీక్షలు ఎప్పటివరకు? :
సీబీఎస్ఈ షెడ్యూల్ ప్రకారం.. పదో తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 16న ప్రారంభమై మార్చి 9, 2027తో ముగియనున్నాయి. ఇక 12వ తరగతి పరీక్షలు కూడా ఫిబ్రవరి 16 నుంచే మొదలై ఏప్రిల్ 9 వరకు కొనసాగనున్నాయి. ఈ రెండు తరగతులకు కలిపి సుమారు 46 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు సమాచారం..
Read Also :
ప్రాక్టికల్ పరీక్షలు ఎప్పుడంటే? :
బోర్డు పరీక్షలతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు, ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్నల్ అసెస్మెంట్ల నిర్వహణపైనా సీబీఎస్ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. సాధారణ పాఠశాలల్లో 2027 జనవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. శీతాకాల ప్రాంతాల్లోని పాఠశాలలకు మాత్రం ప్రత్యేక షెడ్యూల్ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులు తమ పాఠశాల నుంచి వచ్చే సూచనల ప్రకారమే ఫాలో అవ్వాలి..
డేట్‌షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? :
విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ (https://www.cbse.gov.in/)లోకి వెళ్లాలి. అక్కడ (Examination Circulars) సెక్షన్ ఓపెన్ చేసి తమ తరగతికి సంబంధించిన టెన్త్ క్లాస్ లేదా ఇంటర్ డేట్ షీట్ 2027 లింక్‌పై క్లిక్ చేయాలి. వెంటనే డేట్‌షీట్ PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.


