- హెచ్‌పీ నుంచి రెండు కొత్త OLED ల్యాప్‌టాప్‌లు..
- 3K OLED డిస్ప్లే, 70Wh బ్యాటరీ..
- 1.18 కిలోల బరువుతో అదిరిపోయే ఫీచర్లు!
- హెచ్‌పీ ఓమ్నిబుక్ 5 14 ప్రారంభ ధర రూ. 1,09,999
HP OmniBook Laptops : కొత్త ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా? అదిరిపోయే డిస్ప్లే, మంచి బ్యాటరీ బ్యాకప్, తక్కువ బరువుతో అదిరే ల్యాప్‌టాప్ కావాలనుకుంటున్నారా? అయితే, ప్రముఖ టెక్ బ్రాండ్ హెచ్‌పీ భారత మార్కెట్లోకి రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చింది.
హెచ్‌పీ ఒమినిబుక్ 5 14, హెచ్‌పీ ప్రోబుక్ 4 G2iS 14 పేర్లతో లాంచ్ చేసింది. ఈ రెండు మోడళ్లలోనూ ఓఎల్ఈడీ డిస్ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరి ఈ ల్యాప్‌టాప్ ధరలు, ఫీచర్లు ఏమిటో ఓసారి చూద్దాం..
హెచ్‌పీ ఒమినిబుక్ 5 14 ధర, ఫీచర్లు :
హెచ్‌పీ ఒమినిబుక్ 5 14 ప్రారంభ ధర రూ.1,09,999గా నిర్ణయించారు. అయితే, ఆఫర్లతో రూ.79,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నవంబర్ 10 నుంచి అమ్మకాలు మొదలవుతాయి..
ఇందులో 14 అంగుళాల 2K ఓఎల్ఈడీ డిస్ప్లే, 1920×1200 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉన్నాయి. ఇంటెల్ కోర్ 7 వరకు ప్రాసెసర్, 8GB ర్యామ్, 512GB ఎస్ఎస్డీ స్టోరేజ్ అందించారు. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
Read Also :
1080p ఎఫ్‌హెచ్‌డీ ఐఆర్ కెమెరా, డ్యూయల్ స్పీకర్లు, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 60Wh బ్యాటరీ అందించారు. 65W USB-C ఛార్జర్‌తో 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ డివైజ్ బరువు కేవలం 1.16 కిలోలు ఉంటుంది.
హెచ్‌పీ ప్రోబుక్ 4 G2iS 14 స్పెషాలిటీ :
మరోవైపు హెచ్‌పీ ప్రోబుక్ 4 G2iS 14 ప్రారంభ ధర రూ.86వేలు.. ఇందులో 14 అంగుళాల 3K ఓఎల్ఈడీ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. ఇంటెల్ కోర్ 7 350 ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్ ఉన్నాయి. విండోస్ 11 ప్రోతో వస్తుంది. Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సి, యూఎస్బీ టైప్-ఎ పోర్టులు అందించారు. 70Wh బ్యాటరీతో వస్తుంది. 65W ఛార్జర్‌తో 45 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయొచ్చు..
ఈ ల్యాప్‌టాప్ బరువు 1.18 కిలోలు మాత్రమే.. మిస్ట్ సిల్వర్ వేరియంట్ నవంబర్ 6 నుంచి అందుబాటులోకి వస్తుంది. మిగతా కలర్ వేరియంట్లు డిసెంబర్ చివరి నుంచి విక్రయానికి రానున్నాయి.
మొత్తంగా చూస్తే.. తక్కువ బరువు, రోజువారీ పనులకు ఒమినిబుక్ 5 14 అద్భుతమైన ఆప్షన్‌గా కనిపిస్తే.. మెరుగైన డిస్ప్లే, హై ర్యామ్, భారీ బ్యాటరీ కోరుకునేవారికి ప్రోబుక్ 4 G2iS 14 అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.


