ప్రయాణికులకు TGSRTC సూపర్ గుడ్ న్యూస్.. టికెట్ ధరలపై ఏకంగా రూ.620 వరకు తగ్గింపు.. పూర్తి వివరాలు మీకోసం!

Must read

Bus Tickets Reduce: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) దూర ప్రాంత ప్రయాణికులకు అద్భుతమైన శుభవార్త అందించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను (ఆక్యుపెన్సీ) పెంచడంతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీని సమర్థవంతంగా తట్టుకునేందుకు సంస్థ కీలక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరం నుంచి పొరుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన బెంగళూరు, మైసూరు, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో టికెట్ ధరలను తగ్గిస్తూ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది.

రంగారెడ్డి రీజియన్ పరిధిలో అమలు.. ఏ రూట్‌లో ఎంత తగ్గిందంటే?

ఈ రాయితీలను రంగారెడ్డి రీజియన్ పరిధిలోని బిహెచ్‌ఈఎల్ (BHEL) డిపో నుంచి నడిచే బస్సులకు మాత్రమే వర్తింపజేస్తున్నట్లు ఆర్ఎమ్‌ శ్రీదేవి వెల్లడించారు. తగ్గించిన కొత్త ధరల ప్రకారం.. హైదరాబాద్ – విజయవాడ (రాజధాని ఏసీ) టికెట్ ధర రూ.600 నుంచి రూ.500కు (రూ.100 తగ్గింపు), గుంటూరు (సూపర్ లగ్జరీ) రూ.530 నుంచి రూ.450కు (రూ.80 తగ్గింపు) తగ్గింది. అలాగే హైదరాబాద్ – బెంగళూరు (ఏసీ స్లీపర్) ధర రూ.1,440 నుంచి రూ.1,200కు (రూ.240 తగ్గింపు) పడిపోగా, హైదరాబాద్ – మైసూరు (స్లీపర్) రూట్ లో రూ.2,420 గా ఉన్న ధరను రూ.1,800 కు తగ్గించడంతో ప్రయాణికులకు ఏకంగా రూ.620 ఆదా కానుంది.

ప్రైవేట్ పోటీకి చెక్.. ఇతర రూట్లలోనూ సడలింపులకు డిమాండ్:

బిహెచ్‌ఈఎల్(Bus Tickets Reduce) డిపో నుంచి బయలుదేరే అప్ అండ్ డౌన్ ప్రయాణాలకు మాత్రమే ఈ ప్రత్యేక తగ్గింపు ధరలు వర్తిస్తాయి. సేఫ్ ప్రయాణంతో పాటు ఆకర్షణీయ ధరలు అందించడమే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ వంటి మిగతా ప్రధాన డిపోల బస్సుల్లో కూడా రాయితీలు ఇవ్వాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!