Prabhas : బాహుబలి సినిమాతో టాలీవుడ్ దశనే మార్చేసిన పాన్ ఇండియా హీరో ప్రభాస్. ఇప్పుడు గ్యాప్ లేకుండా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇస్తున్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ జర్నీ 24 ఏళ్లుగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సెట్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. అందరినీ ప్రేమించే ప్రభాస్ ను అందరూ ఇష్టపడే డార్లింగ్ లా మారాడు. స్టార్ గా ప్రభాస్ స్టామినా బాక్సాఫీస్ రికార్డులు చెబితే, అందరూ ప్రేమగా పిలిచే డార్లింగ్ అనే మాట వ్యక్తిగా ఆయన గొప్పదనం చూపిస్తుంది.
ప్రభాస్ కొత్త సినిమా వచ్చిందంటే ఇండియన్ బాక్సాఫీస్ లో కలెక్షన్స్ వర్షమే. తన భారీ సినిమాల్లో శ్రమతో, అంకితభావంతో, నటనతో తను చేస్తున్న క్యారెక్టర్స్, బ్యాక్ టు బ్యాక్ ఈ హ్యూజ్ మూవీస్ చేసేందుకు ఆయన పడుతున్న కష్టం ప్రభాస్ ను అందుకోలేనంత ఎత్తులో నిలబెడుతున్నాయి. ఆయన అభిమానులు గర్వించేలా చేస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ డమ్ దాటేసి గ్లోబల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్.
Also Read : RC 17 : దసరాకి ఓపెనింగ్ అన్నారు.. చరణ్, సుకుమార్ సినిమా ఏమైంది? లండన్లో ఉన్నారా?
బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ పాన్ ఇండియా జర్నీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్ బిజినెస్..ఇలా ఏ విషయంలో చూసినా ప్రభాస్ అందుకోలేనంత స్థాయికి చేరుకున్నారు. ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ స్టార్స్ తో పోటీ పడేంతగా నార్త్ లో కలెక్షన్స్ సాధిస్తున్నాయి.
బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రెండు సార్లు సాధించిన స్టార్ మన ప్రభాస్. ఓవర్సీస్ మార్కెట్లో పది మిలియన్లకుపైగా వసూళ్లను సాధించిన తొలి హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు. మన దేశంలోనే కాదు ఓవర్సీస్ లో యూఎస్, యూకే, జపాన్..ఇలా ప్రతి దేశంలోనూ ప్రభాస్ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. ప్రభాస్ కేవలం సినిమాల్లోనే హీరో కాదు సమాజం కోసం తన వంతు సపోర్ట్ అందిస్తూ సేవలో ఎప్పుడూ ముందుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. డ్రగ్స్ వద్దని ప్రచారం చేసినా, ప్రకృతి విపత్తుల సమయంలో భారీ విరాళాలు ఇచ్చినా అది ఆయన మంచి మనసు.
వరుస సినిమాలతో మెప్పిస్తున్న ప్రభాస్ ఇప్పుడు భారీ పాన్ ఇండియా సినిమాల లైనప్ పెట్టుకున్నాడు. సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ, వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న కల్కి 2, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మించనున్న సలార్ 2 చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. ఇవే కాకుండా హోంబేలె ఫిలిమ్స్ కి మరో రెండు సినిమాలు, పీపుల్స్ మీడియాకు ఒక సినిమా, బాలీవుడ్ దర్శకుడితో ఒక సినిమా కూడా లైన్లో ఉన్నాయి. ఈ సినిమాలపై ఫ్యాన్స్, ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఫౌజీ సినిమా రాబోయే సమ్మర్ లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతోంది. స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. కల్కి 2 ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే సలార్ 2 సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇలా భారీ సినిమాలు లైనప్ పెట్టుకొని దూసుకుపోతున్నాడు మన డార్లింగ్.


