Tibet Earthquake : టిబెట్‌లో బీభత్సం సృష్టించిన భారీ భూకంపం.. 16 మంది మృతి, వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం

Must read

Tibet Earthquake : టిబెట్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 7.0 తీవ్రతగా నమోదైంది. ఈ భారీ ప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోగా, 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 300కిపైగా నివాస గృహాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి.

Also Read : AP Municipal Elections 2026 : ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్.. నవంబర్ 1న పోలింగ్, 3న ఫలితాలు!

ఉత్తర టిబెట్‌లోని నాగ్కు (Nagqu) ప్రాంతానికి ఈశాన్యంగా సుమారు 190 కిలోమీటర్ల దూరంలో పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. కేవలం 40 నిమిషాల వ్యవధిలోనే వరుసగా రెండుసార్లు భూమి కంపించడంతో స్థానికులు ప్రాణభయంతో ఇండ్ల నుంచి పరుగులు తీశారు. ఈ భారీ భూకంపం కారణంగా విద్యుత్‌, టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. భూకంప తీవ్రత దృష్ట్యా లెవల్‌-2 అత్యవసరస్థితిని చైనా ప్రకటించింది. చైనా విపత్తు నిర్వహణ సంస్థ పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది.

యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) సమాచారం ప్రకారం.. ఈ భూకంపం దాదాపు 10కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. ముఖ్యంగా, కొన్ని వారాల క్రితం నేపాల్ – టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఘోర ఆకస్మిక వరదల కారణంగా 1,400 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. వరదలు సృష్టించిన ప్రాణ, ఆస్తినష్టాల విషాద ఘటనలు మరవకముందే, ఇప్పుడు ఈ భారీ భూకంపం తోడవడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

మరోవైపు, చైనాలో మరోచోట కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) నివేదిక ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌కు ఉత్తర-వాయువ్యంగా సుమారు 505 కి.మీ దూరంలో 15 కి.మీ లోతులో 5.2 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!