Bigg Boss Telugu 10 : GOAT టైటిల్ కోసం హౌస్ లో పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం రామ్ ప్రసాద్ రోహిత్ తో మాట్లాడాడు. శివ చేసే ప్లాన్స్ గురించి రోహిత్ తో మాట్లాడాడు. నేడు goat పోరు కంటిన్యూ చేస్తూ రెడ్ లెవల్ లో ఉన్న వాళ్లకు GOAT అయ్యే అవకాశం లేదు అని చెప్పేసాడు బిగ్ బాస్. ఎల్లో లెవల్ లో ఉన్నవాళ్లకు ఇచ్చే టాస్క్ పూర్తి చేసి గ్రీన్ లెవల్ కి వెళ్ళాలి. ఆలా అవెళ్లిన వాళ్ళు goat అని చెప్పాడు. ఒక కర్రను భుజం మీద పెట్టుకొని త్రిరుగుతూ ఉండాలి. బిగ్ బాస్ చెప్పినప్పుడల్లా ఆ కర్రకు సంచాలక్ చెప్పిన వాళ్ళు బరువులు వేయాలి. మోయలేక పడిపోయిన వాళ్ళు దీంట్లోంచి ఎలిమినేట్ అవుతారు. రెండు, మూడు కేజీలు బరువు ఉన్న సంచులు ఉన్నాయి. ఎన్ని సంచులు వేయాలి అని బిగ్ బాస్ చెప్తాడు.
మొదట శ్వేతా నాయుడు సంచాలక్. ఎల్లో లెవల్ లో ఉన్న త్రిగున్, రామ్ ప్రసాద్ , నరేష్, ముకేశ్, శివ, వర్షిణి, దేబ్జానీ, నీతూలు ఈ టాస్క్ ఆడారు. బరువులు వేసే వాళ్ళని టాస్క్ ఆడేవాళ్లు వేయకూడదు అని బతిమాలుకోవాలి. మొదట దక్షి దేబ్జానీ, నీతూకి బరువు వేసింది. రామకృష్ణ మొత్తం వర్షిణికి వేసాడు. వర్షిణికి బరువు పెరగడంతో ఏడ్చేసింది. రామకృష్ణ ను చూసుకుంటా అని వార్నింగ్ ఇచ్చింది. రోహిత్ ఊహించినట్టే మూడు త్రిగున్ కి వేసాడు. వర్షిణి మోయలేక పడిపోయింది.
నెక్స్ట్ వంశీ మూడు వెయిట్స్ నీతూకి వేసాడు. ముకేశ్ రోహిత్ ని వేయకు అని అడగడంతో రోహిత్ కూడా నేను కరెక్ట్ గా ఆడితే నా కోసం మాట్లాడు అని అడుక్కున్నాడు. శ్వేతా మూడు త్రిగున్ కి ఒకటి రామ్ ప్రసాద్ కి వేసింది. షాలిని రెండు త్రిగున్ కి, ఒకటి శివ కి వేసింది. అనంతరం వంశీ సంచాలక్ గా మారాడు. వర్షిణి రెండు సంచులు శివకి, రెండు నీతూకి వేసింది. సుధీర్ మూడు అమన్ కి, ఒకటి శివకి వేసాడు. శివ – శ్వేతా అమన్, శివ సేఫ్ అవ్వాలి అని మాట్లాడుకున్నారు. శ్వేతా శివ కి మూడు, అమన్ కి ఒకటి వేసింది. శివకి బరువు ఎక్కువ అవ్వడంతో వదిలేసాడు. శివ ముకేశ్ కి నాలుగు ఒకేసైడ్ వేయడంతో శివ, ముకేశ్ కి గొడవ అయింది. సుధీర్ రెండు ముకేశ్ కి మూడు త్రిగున్ కి వేసాడు. సుధీర్ – శివ కి గొడవ అయింది. నీతూ మోయలేక వదిలేసింది.
అనంతరం షాలిని – రెండు త్రిగున్ కి, రెండు దేబ్జానీకి వేసింది. రామకృష్ణ – రామ్ ప్రసాద్ కి రెండు, ముకేశ్ కి రెండు వేసాడు. త్రిగున్ కి ఎక్కువ బరువు అవ్వడంతో వదిలేసాడు. అనంతరం వర్షిణి సంచాలక్ గా మారింది. ఝాన్సీ రెండు దేబ్జానీ, రెండు రామ్ ప్రసాద్ కి వేసింది. దేబ్జానీ వదిలేసింది. త్రిగున్ – అయిదు ముకేశ్ కి వేసాడు. రోహిత్ – ముకేశ్ కి మూడు, నరేష్ కి ఒకటి వేసాడు. ముకేశ్ వదిలేసాడు. ముకేశ్ – రెండు రామ్ ప్రసాద్ కి, అమన్ కి రెండు వేసాడు. వంశీ నాలుగు అమన్ కి, రామ్ కి రెండు వేసాడు. శ్వేతా.. రామ్ ప్రసాద్ కి నాలుగు, నరేష్ కి రెండు వేసింది. రామ్ ప్రసాద్ ఆపుకుంటాడు అనుకున్నారు కానీ బరువు పెరగడంతో వదిలేసాడు.
Also Read : Viva Harsha : దసరా స్పెషల్.. భార్యతో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన వైవా హర్ష..
రామ్ ప్రసాద్ – అమన్ కి నాలుగు వేసాడు. శివ – అమన్ కి రెండు, నరేష్ కి రెండు వేసాడు. చివర ముకేశ్ కి ఛాన్స్ రావడంతో అమన్ కి వేద్దామనుకునే లోపు అమన్ వదిలేసాడు. చివరికి నరేష్ గెలిచాడు. టాస్క్ అయ్యాక మళ్ళీ ముకేశ్ – శివ గొడవ పడ్డారు. అమన్ నాకెవరు లేరు ఇంట్లో అని ఏడుస్తూ వెళ్ళిపోయాడు. నాకెవరూ హెల్ప్ చేయలేదు అని ఏడ్చాడు. ముకేశ్ – శివ మళ్ళీ గొడవ పడ్డారు. దీంతో శివ ఏడ్చాడు. దేబ్జానీ ఇంటికి వెళ్ళిపోతాను అని ఏడ్చేసింది.
చివరకు నరేష్ ని విన్నర్ goat అవుతాడు అనుకుంటే. నరేష్ గెలిచినా ఎక్కువ సేపు నిలబడి మోసినా ఎక్కువ వెయిట్స్ లేవు అని పక్కకు తప్పించి రూల్ మార్చేసి ఎక్కువ వెయిట్స్, ఎక్కువ సేపు మోసినందుకు అమన్ ని goat చేసాడు బిగ్ బాస్. దాంతో అమన్ రెండు వారాల పాటు ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు.
దేబ్జానీ, నీతూ మాస్టర్ లను కూడా లేడీస్ లో ఎక్కువ సేపు ఉన్నందుకు, ఎక్కువ బరువు మోసినందుకు goat లని చేసాడు బిగ్ బాస్. వీళ్ళను కూడా రెండు వారాల పాటు ఎలిమినేషన్ నుంచి తప్పించారు. అంతా అయ్యాక నరేష్ రామ్ ప్రసాద్ దగ్గర తనకు అన్యాయం చేసినందుకు ఏడ్చాడు. బిగ్ బాస్ రూల్ మార్చేసినందుకు ఏడ్చాడు. ముందే చెప్తే అసలు ఆడే వాడ్ని కాదు కదా అని ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి goat టాస్కుల్లో అందరూ ఫిజికల్ గా చాలా కష్టపడ్డారు. ఏడ్చారు. గొడవలు అయ్యాయి.


