Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ వరకు సిఫార్సు లేఖలు స్వీకరించరు.. కారణమిదే..

Must read

Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండటంతో తిరుమల శ్రీవారి దర్శనం, వసతి కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. కాకపోతే తిరుమలకు స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం, వసతి కల్పిస్తామని తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉన్నంత వరకు సిఫార్సు లేఖలను స్వీకరించరని.. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Also Read : AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

డిసెంబర్ మొదటి వారం వరకు తిరుమల యాత్రకు వెళ్లాలని భావిస్తున్న భక్తులు టీటీడీ తాజా సూచనలను దృష్టిలో పెట్టుకోవాలి. దర్శనం, వసతి కోసం అందుబాటులో ఉన్న అధికారిక బుకింగ్ విధానాల ద్వారా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. ఎన్నికల కోడ్‌కు సహకరించాలని, నిబంధనలను పాటించాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం: టీటీడీ చైర్మన్
అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో భారీ వర్షాలు కురిసినా భక్తుల భక్తిశ్రద్ధలకు ఎలాంటి ఆటంకం కలగకుండా టీటీడీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు అంకితభావంతో సేవలందించారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. ఈ 8 రోజుల్లో 6.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.25.79 కోట్ల ఆదాయం లభించిందని, 22.60 లక్షల మందికి అన్నప్రసాదాలు, 34.34 లక్షల లడ్డూలు అందించగా, 2.44 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు.

26 రాష్ట్రాలతో పాటు ఖతర్, దుబాయ్ నుంచి 6,777 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో బ్రహ్మోత్సవాలకు మరింత వైభవాన్ని తీసుకొచ్చారు. 60 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 5 లక్షల కట్ ఫ్లవర్స్‌తో తిరుమలలో విశేష అలంకరణలు, ఎన్నడూ లేని విధంగా విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 39 ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా సుమారు 7 లక్షల మంది భక్తులకు ఉచిత రవాణా, 4,500 మంది శ్రీవారి సేవకుల సేవలు, 75 మంది వైద్యులు, 20 అంబులెన్సులతో వైద్య సేవలు, 2,800 మంది పోలీసులు, 2,000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.

గరుడసేవ రోజున వర్షంలోనూ భక్తులకు నిరంతర సేవలందించిన 3,500 మంది పారిశుద్ధ్య సిబ్బందికి బీఆర్ నాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు, భక్తుల సౌకర్యాలు, భద్రత, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లలో అంకితభావంతో పనిచేసిన ప్రతి ఉద్యోగి, అధికారి, శ్రీవారి సేవకులు, కళాకారుడు, పోలీసు, వైద్య సిబ్బంది సహా బ్రహ్మోత్సవాల విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ టీటీడీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అని బీఆర్ నాయుడు తెలిపారు. అదేవిధంగా త్వరలో శ్రీ వేంకటేశ్వర మ్యూజియంను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!