Supreme Court: తెలంగాణ పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రైవేటు బడుల్లో ఉచిత విద్య.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Must read

Supreme Court: తెలంగాణలోని ఆర్థికంగా వెనుకబడిన, నిరుపేద కుటుంబాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అందించే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1)(సి) నిబంధనల ప్రకారం ప్రైవేటు బడుల్లో ఒకటో తరగతి లేదా ప్రీ-ప్రైమరీ స్థాయిలో 25 శాతం సీట్లను బలహీన వర్గాల విద్యార్థులకు కేటాయించాల్సి ఉంది. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)తీవ్రంగా స్పందించడం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం వివరణ కోరడంతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారుల్లో స్పష్టమైన చలనం వచ్చింది.

Chandrababu Naidu: ఏపీ స్థానిక ఎన్నికల్లో రెబల్స్‌కు చెక్.. విత్‌డ్రా చేసుకోకుంటే సస్పెన్షన్ వేటు.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్!

క్షేత్రస్థాయిలో మందగమనం.. గడిచిన రెండేళ్లలో 180 మందే:

రాష్ట్రంలో గత ఏడాది ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని 96 ఆవాసాల్లోని పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. అయితే ఈ ఆదేశాల అమలు క్షేత్రస్థాయిలో తీవ్ర మందగమనంతో సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ సమాచారం ప్రకారం 2025-26, 2026-27 విద్యా సంవత్సరాల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 180 మంది విద్యార్థులకే ఉచిత ప్రవేశాలు దక్కడం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ నిబంధనలను ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి.

సుప్రీంకోర్టు ఆదేశాలు.. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పారదర్శక సీట్ల కేటాయింపు:

ఈ నెల 27న జరిగే కీలక విచారణ సందర్భంగా రాష్ట్రంలో RTE అమలు తీరుపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ఎన్‌సీపీసీఆర్‌ను ఆదేశించింది. దీంతో విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఢిల్లీ వేదికగా హామీ ఇస్తూ, త్వరలోనే ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్, పారదర్శక లాటరీ విధానం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. త్వరలోనే అడ్మిషన్ల షెడ్యూల్, అర్హతల ప్రమాణాలపై స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!