iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై ఏ ప్లాట్‌ఫామ్ బెస్ట్ ఆఫర్ ఇస్తోంది? ఈ మూడు స్టోర్లలో ఎక్కడ చీప్..?

Must read

  • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్‌లో బెస్ట్ డీల్ ఎక్కడంటే
  • ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనేముందు ఇది చూడండి.. ఈ మూడు స్టోర్లలో ఏది బెస్ట్?
  • లక్షల ఫోన్‌పై వేలల్లో ఆదా చేయొచ్చా? ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ బెస్ట్ డీల్స్ ఇవే

Amazon vs Flipkart vs Reliance Digital : అసలే పండుగల సీజన్‌.. కొత్త ఐఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం.. ప్రస్తుతం ప్రముఖ రిటైల్ ప్లాట్‌ఫామ్‌లు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఆపిల్ ప్రీమియం ఫోన్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

ఈ ఐఫోన్ మోడల్ ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ డిస్కౌంట్లు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, క్యాష్‌బ్యాక్‌ ద్వారా భారీగా డబ్బు ఆదా చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్‌లో ఈ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై ఎంత డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి? ఎందులో తక్కువకు లభిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర ఎంత? :
అమెజాన్‌లో ఈ ఐఫోన్ 256GB వేరియంట్ ధరను రూ.1,49,900 నుంచి రూ.1,44,900కు తగ్గింది. అదనంగా పాత (iPhone 17 Pro Max) స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ.37,600 వరకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అయితే, ఈ వాల్యూ పాత ఫోన్ మోడల్, కండిషన్ ఆధారంగా మారుతుంది.

Read Also : Xiaomi Pad 8 Amazon : సూపర్ డిస్కౌంట్ బ్రో.. రూ. 10వేలు తక్కువకే షావోమీ ప్యాడ్ 8.. అమెజాన్ డీల్ అదుర్స్..!

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల ప్రత్యేకత ఏమిటి?
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ ధర రూ.1,49,900గా ఉండగా, HDFC క్రెడిట్ కార్డుతో రూ.6వేలు తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే గరిష్ఠంగా రూ.71,650 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందే అవకాశం ఉంది. అయితే, ఈ టాప్ వాల్యూ ప్రతి కస్టమర్‌కు వర్తించదు.

రిలయన్స్ డిజిటల్‌లో భారీ తగ్గింపులు :
రిలయన్స్ డిజిటల్‌లో ఈ ఐఫోన్‌పై రూ.9,910 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ధర రూ.1,39,990కు చేరుతుంది. అదనంగా రూ.55వేల వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ, రూ.10వేల బోనస్, రూ.3వేల క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉండొచ్చు. అన్ని అర్హతలతో ధర రూ.71,990కు తగ్గవచ్చు. ఈ ప్రత్యేక ఆఫర్లు ఫిజికల్ స్టోర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఏ ప్లాట్‌ఫామ్‌ బెటర్? :
తక్కువ ప్రారంభ ధరలో అమెజాన్, హై ఎక్స్ఛేంజ్ వాల్యూ కోసం ఫ్లిప్‌కార్ట్, స్టోర్ ఆఫర్ల కోసం రిలయన్స్ డిజిటల్ ఎంచుకోవచ్చు. అయితే పాత ఫోన్ వాల్యూ, బ్యాంక్ అర్హతలు, క్యాష్‌బ్యాక్ నిబంధనలను బట్టి ఫైనల్ ధర మారుతుంది. కొనుగోలు చేసే ముందు అన్ని ఆఫర్లను చెక్ చేయాలి. చెక్అవుట్ వద్ద కనిపించే ధరను కంపేర్ చేయడం అసలు మర్చిపోవద్దు..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!