PM Narendra Modi : దేశ సంస్కృతి, సంప్రదాయాలను ద్వేషించేవారు దేశానికి పెద్ద శత్రువులు : ప్రధాని నరేంద్ర మోదీ

Must read

PM Modi Attended Vijayadashami Celebrations : రామరాజ్యం అంటే ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం, సమాన అవకాశాలు కల్పించే పాలన అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అధికారంలో ఉండటమే పాలన లక్ష్యం కాదని, ప్రజల సంక్షేమమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. విజయదశమి సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని ఇంద్రప్రస్థ రామ్‌లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. శ్రీరాముడి ఆదర్శాలు, దేశ స్వావలంబన, పేదల సంక్షేమం గురించి మాట్లాడారు

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘‘రామరాజ్యం అంటే వివక్షకు తావులేని పాలనా వ్యవస్థ. అక్కడ న్యాయం అందరికీ అందుతుంది. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. అలాంటి పాలనలో అధికారం ఉద్దేశం కేవలం పాలించడం మాత్రమే కాదు.. ప్రజల సంక్షేమాన్ని నిర్ధారించడం కూడా. పేదలు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలి. శ్రీరాముడి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. సంక్షోభం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత క్లిష్టమైనదైనా మనం ఇతరులపై ఆధారపడకూడదు. మనలోని సామర్థ్యాన్ని గుర్తించాలి. మన వనరులపై నమ్మకం ఉంచాలి. మన సంకల్పాన్ని శక్తిగా మార్చుకోవాలి. స్వయంకృషితో సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలి. నేడు మనం కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి. వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్), ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంబన భారత్) నిర్మాణమే మన ముందున్న లక్ష్యాలు.” అని ప్రధాని మోదీ అన్నారు.

మన సంస్కృతిని ద్వేషించే వారి మానసికత ఈ దేశానికి శత్రువు. విజయదశమి శుభ పర్వదినం సందర్భంగా మనం మన సంకల్పాన్ని మరోసారి పునరావృతం చేయాలి. మనం భారతమాత శత్రువులను గుర్తించాలి, వారిని ఓడించాలి. ఇండియా ఫస్ట్‌ అనే సంకల్పాన్ని తీసుకుంటూ అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. అయోధ్య మందిరంలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ‘రామ్ సే రాష్ట్రీయ’, ‘దేవ్ సే దేశ్’ అనే భావనతో మనం చేసిన సంకల్పాన్ని కచ్చితంగా నెరవేరుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!