RC 17 : రెండు పార్టులుగా RC17..!

Must read

RC 17 : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17 సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగబోతుందనే ప్రచారం నేపథ్యంలో, ఇప్పుడీ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన టాక్ ఒకటి వైరల్ అవుతోంది.

RC17 మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఫస్ట్ పార్ట్‌ను 2028 మధ్యలో, రెండో భాగాన్ని 2029 స్టార్టింగ్‌లో విడుదల చేసేలా మేకింగ్ షెడ్యూల్ ఫిక్స్ చేస్తు్నారనే చర్చ నడుస్తోంది. అదే నిజమైతే, రెండు పార్టుల మధ్య కేవలం ఆరు నెలల వ్యవధి మాత్రమే ఉండే అవకాశం ఉంది. అయితే ఇది రియలో లేదా వైరలో తెలియాలంటే మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Saanve Megghana : మీకు బొట్టు అంటే ఇష్ట‌మా? తెలుగు అమ్మాయి శాన్వి మేఘ‌న ఫోటోలు వైర‌ల్‌..

సుక్కు, చెర్రీ కాంబోలో రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరు వినిపిస్తుండగా, హీరోయిన్‌గా సారా అర్జున్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఆసక్తిని పెంచుతోంది. రామ్ చరణ్‌కు రంగస్థలంతో బ్లాక్‌బస్టర్ అందించిన సుకుమార్, ఈసారి అంతకుమించిన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నారనే అంచనాలు ఉన్నాయి.

మాస్ ఎలిమెంట్స్‌, స్ట్రాంగ్ కంటెంట్‌, అదిరిపోయే మ్యూజిక్‌తో రంగస్థలం, పుష్పకు మించి సుక్కు, చెర్రీ కాంబినేషన్‌.. మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ప్లానింగ్ నడుస్తోందని అంటున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!