- దసరా, దీపావళికి సొంతూరికి వెళ్తున్నారా? రైల్వే శాఖ కీలక ప్రకటన
- పండుగ ప్రయాణానికి టెన్షన్ వద్దు.. ఈ రైళ్లలో ఇంకా సీట్లు ఉన్నాయి
- తిరుమల యాత్రకు ప్లాన్ చేస్తున్నారా? ఈ రైళ్ల బెర్తుల వివరాలు మీకోసమే
Tirumala Devotees Alert : దసరా, దీపావళి పండుగలకు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకూ గుడ్ న్యూస్.. పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లను నడుపుతోంది. అంతేకాదు.. పలు స్పెషల్ ట్రైన్లలో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను కూడా ప్రకటించింది. దీంతో రైలు ప్రయాణం ప్లాన్ చేసుకునేవారికి ఈజీగా ఉంటుంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పండుగల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు. ఈ నేపథ్యంలో జల్నా-తిరుపతి ప్రత్యేక రైలు (07814)లో అక్టోబర్ 22న 76 బెర్తులు, అక్టోబర్ 29న 283 బెర్తులు ఉన్నాయి. నవంబర్ 5న 516, నవంబర్ 19న 343, నవంబర్ 26న 690 బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
Read Also : AP Municipal Elections : చివరి రోజు పోటాపోటీ.. ఏపీలో ముగిసిన నామినేషన్ల పర్వం.. మున్సిపల్ పోరుకు సిద్ధం..!
అలాగే హెచ్.ఎస్. నాందేడ్-తిరుచానూరు ప్రత్యేక రైలు (07603)లో అక్టోబర్ 20న 508, అక్టోబర్ 27న 587 బెర్తులు ఉన్నాయి. నవంబర్ 3న 847, నవంబర్ 10న 489, నవంబర్ 17న 756, నవంబర్ 24న 858 బెర్తులు ఉన్నాయి.
ఇతర మార్గాల్లోనూ స్పెషల్ ట్రైన్లు :
సికింద్రాబాద్-శ్రీకాకుళం (07425), చర్లపల్లి-శ్రీకాకుళం (07037) ప్రత్యేక రైళ్లలోనూ నవంబర్ నెలలో పలు తేదీలకు వందల సంఖ్యలో బెర్తులు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. చర్లపల్లి-ససారం (07041), సికింద్రాబాద్-కాకినాడ (07039), చర్లపల్లి-నరసాపురం (07063) రైళ్లలోనూ వివిధ తేదీలకు ఖాళీలు ఉన్నాయి.
బుకింగ్ ముందు ఇలా చేయండి :
పండుగల సమయంలో రిజర్వేషన్లు ఫుల్ అవుతాయి. అందుకే ప్రయాణ తేదీకి ముందు IRCTC అధికారిక వెబ్సైట్ లేదా యాప్లో లేటెస్ట్ సీట్ల లభ్యతను చెక్ చేయండి. బెర్తుల సంఖ్యలు మారి ఉండవచ్చు.
అందుబాటులో ఉన్న సీట్లను చెక్ చేశాకే టికెట్ బుక్ చేసుకోవడం బెటర్. తిరుమల యాత్రకు లేదా పండక్కి ఊళ్లకు వెళ్లేవాళ్లు ఆలస్యం చేయకుండా ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.


