Income Tax Recruitment 2026 : వావ్.. స్పోర్ట్స్‌ కోటాలో 119 ఉద్యోగాలు.. టెన్త్, డిగ్రీ పాసైతే చాలు.. దరఖాస్తు లాస్ట్ డేట్ ఇదే..!

Must read

  • నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు
  • కేంద్ర ప్రభుత్వ కొలువు ఛాన్స్‌.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు..
  • ట్యాక్స్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌, MTS పోస్టులు.. అర్హతలు ఇవే!

Income Tax Recruitment 2026 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అద్భుతమైన శుభవార్త.. ముఖ్యంగా క్రీడల్లో ప్రతిభ చాటిన అభ్యర్థులకు ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) నుంచి అదిరిపోయే అవకాశం..

స్పోర్ట్స్ కోటాలో మొత్తం 119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో ట్యాక్స్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (MTS) పోస్టులను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

పోస్టుల వారీగా ఖాళీలివే :
ఈ నియామకాల్లో మొత్తం 119 పోస్టులు ఉన్నాయి. ట్యాక్స్‌ అసిస్టెంట్‌ విభాగంలో 44, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2లో 9, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (MTS) విభాగంలో 66 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హతలు ఉన్నవారికి పోస్టును బట్టి అవకాశం లభించనుంది.

Read Also : AP Municipal Elections : చివరి రోజు పోటాపోటీ.. ఏపీలో ముగిసిన నామినేషన్ల పర్వం.. మున్సిపల్ పోరుకు సిద్ధం..!

విద్యార్హతలు, వయోపరిమితి :
ట్యాక్స్‌ అసిస్టెంట్‌ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయసు 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2 పోస్టులకు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన అర్హతతో పాటు నిర్దేశించిన స్టెనోగ్రఫీ స్కిల్ టెస్టులో ఉత్తీర్ణత సాధించాలి.

MTS పోస్టులకు పదో తరగతి లేదా తత్సమాన అర్హత అవసరం. అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నోటిఫికేషన్‌ నిబంధనల ప్రకారం.. వయోసడలింపులు వర్తించే అవకాశం ఉందో లేదో పరిశీలించాలి.

స్పోర్ట్స్ సర్టిఫికెట్లు తప్పనిసరి :
స్పోర్ట్స్ కోటా నియామకం కావడంతో గుర్తింపు పొందిన క్రీడా విజయాలు, సంబంధిత సర్టిఫికేట్లు చాలా కీలకం.. అభ్యర్థుల క్రీడా ప్రతిభ, విద్యార్హతలు, వయసు తదితర అంశాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో ఒరిజినల్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, స్కిల్స్ టెస్టులు కూడా ఉంటాయి.

దరఖాస్తుకు చివరి తేదీ :
నోటిఫికేషన్ ప్రకారం.. నవంబర్‌ 10, 2026 దరఖాస్తుకు చివరి తేదీ. అయితే, దరఖాస్తు చేసే ముందు సంబంధిత ఆదాయపు పన్ను శాఖ అధికారిక నోటిఫికేషన్‌లో ఖాళీలు, క్రీడా అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు లింక్‌, చివరి తేదీ వివరాలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!