Airtel Recharge Plans : డేటా వాడని వారికి పండగే.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌.. ఎయిర్‌టెల్‌ నుంచి 3 సరికొత్త ప్లాన్లు..!

Must read

  • డేటా అవసరం లేదా? రూ.185 నుంచే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌
  • ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.200కే దగ్గరగా 3 కొత్త ప్లాన్లు
  • డేటా లేకుండానే రీఛార్జి.. ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్ల పూర్తి వివరాలివే

Airtel Recharge Plans : మొబైల్‌ డేటా అవసరం లేదా? మీకో గుడ్ న్యూస్.. కస్టమర్ల కోసం భారతీ ఎయిర్‌టెల్‌ గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం వాయిస్ కాల్స్‌, ఎస్సెమ్మెస్‌ల బెనిఫిట్స్ అందించే 3 కొత్త ప్రీపెయిడ్‌ రీఛార్జి ప్లాన్లను ప్రవేశపెట్టింది.

అందులో రూ.185, రూ.203, రూ.206 ధరలతో ప్రవేశపెట్టింది. ట్రాయ్‌ (TRAI) నిర్దేశించిన అక్టోబర్‌ 21 గడువుకు (Airtel Recharge Plans) ముందే ఈ ప్లాన్లను తీసుకొచ్చిన ఫస్ట్ టెలికాం ఆపరేటర్‌గా ఎయిర్‌టెల్‌ నిలిచింది. పూర్తి ప్లాన్ల ధరలివే..

3 ప్లాన్ల ధరలు, వ్యాలిడిటీ వివరాలివే :
రూ.185 ప్లాన్‌ : ఈ రీఛార్జ్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్ లిమిటెడ్ లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌తో పాటు 300 ఎస్సెమ్మెస్‌లు పొందొచ్చు.

రూ.203 ప్లాన్‌ : 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లోనూ అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 300 ఎస్సెమ్మెస్‌లు అందుబాటులో ఉంటాయి.

Read Also : Tirumala Devotees Alert : శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్.. పండుగ స్పెషల్ రైళ్లలో బెర్తులు ఖాళీ.. వెంటనే బుక్ చేసుకోండి!

రూ.206 ప్లాన్‌ : నెలవారీ రీఛార్జ్ తీసుకునేవారికి బెస్ట్ ఆప్షన్‌. నిర్ణీత 30 రోజుల బదులు క్యాలెండర్‌ నెల ప్రాతిపదికన వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులోనూ అన్ లిమిటెడ్ కాల్స్‌, 300 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

ఈ 3 ప్లాన్లలో మొబైల్‌ డేటా బెనిఫిట్ ఉండదు. ఫ్రీ హలోట్యూన్స్‌ సదుపాయం మాత్రం అందిస్తారు. ఎయిర్‌టెల్‌ అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లో ఈ రీఛార్జ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ట్రాయ్‌ నిబంధనలేంటి? :
వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ సేవలకే ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులు వాడని మొబైల్‌ డేటా కోసం కూడా డబ్బు చెల్లించాల్సిన అవసరాన్ని తగ్గించడమే ట్రాయ్‌ నిబంధనల ఉద్దేశం. 2026లో సవరించిన వినియోగదారుల పరిరక్షణ నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలు డేటా లేని వాయిస్‌-ఎస్సెమ్మెస్‌ ప్లాన్లను అందించాలి.

ఎవరికి ఉపయోగం? :
ఫీచర్‌ ఫోన్లు వాడేవారు, సీనియర్‌ సిటిజన్లు, సెకండరీ సిమ్‌ కస్టమర్లు, ఇంటర్నెట్‌ కోసం వై-ఫైపై ఆధారపడేవారికి ఈ ప్లాన్లు అద్భుతంగా ఉంటాయి. అవసరం లేని డేటా కోసం అదనంగా చెల్లించకుండా తమకు సరిపోయే వ్యాలిడిటీని ఎంచుకోవచ్చు. మొత్తానికి, 28 రోజులు, 30 రోజులు లేదా క్యాలెండర్‌ నెల వ్యాలిడిటీతో అవసరాలకు తగ్గ రీఛార్జిని ఎంచుకోవచ్చు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!