Ranabaali Twitter Review : ర‌ణ‌బాలి ట్విట్ట‌ర్ రివ్యూ.. విజ‌య్‌దేవ‌ర‌కొండ ఖాతాలో మ‌రో బ్లాక్ బాస్ట‌ర్‌!

Must read

Ranabaali Twitter Review : పెళ్లి త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తున్న చిత్రం ర‌ణ‌బాలి. రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హాలీవుడ్ స్టార్ నటుడు అర్నాల్డ్ వాస్లూ విలన్‌గా న‌టించ‌గా.. సీనియర్ నటి ఈశ్వరి రావు కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే ట్రైల‌ర్‌, పాట‌ల‌తో ప్రేక్ష‌కుల్లో మంచి ఆస‌క్తిని క‌ల‌గ‌జేసింది.

ఇక భారీ అంచ‌నాల న‌డుమ, ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రం నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప‌లు చోట్ల షోలు ప‌డ్డాయి. వీటిని వీక్షించిన ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు.

Sundeep Kishan : సందీప్ కిషన్ కొత్త సినిమా ఓపెనింగ్.. ముగ్గురు హీరోయిన్స్‌తో..

బ్రిటీష్‌ పాలకుల అరాచకాలు, దౌర్జన్యాలు, 1854–78 మధ్య రాయలసీమ కరువు పరిస్థితులు, ఆనాటి ప్రజల ఆకలి బాధలు, బ్రిటీష్‌ సర్కార్‌ అన్యాయపు పన్నులు, ఈ నేపథ్యంలో రణబాలి కథ ఉన్నట్లుగా చెబుతున్నారు. శింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్‌ దేవరకొండ న‌ట‌న అద్భుతం అని అంటున్నారు. ఆయన న‌ట‌న చాలా కాలం గుర్తుండిపోతుంద‌ని చెబుతున్నారు. ఇక ర‌ష్మిక కూడా త‌న పాత్ర‌లో మెప్పించింద‌ని అంటున్నారు. అజయ్-అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బ‌లం అని చెబుతున్నారు.

ప్రీ-ఇంటర్వెల్ సన్నివేశాల బిల్డప్, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింద‌ని అంటున్నారు. కొన్ని సీన్లలో విజయ్‌ను చూస్తుంటే గూస్‌బంప్స్ వచ్చాయని చెబుతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఖాతాలో మ‌రో బ్లాక్ బాస్ట‌ర్ అని అంటున్నారు. మొత్తానికి సోష‌ల్ మీడియాలో ఈ చిత్రానికి మంచి స్పంద‌న వ‌స్తోంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!