
- టాటా ప్లే స్మార్ట్ నెలవారీ ప్లాన్ల ధర రూ. 199 నుంచి ప్రారంభం
- సెట్ టాప్ బాక్స్, డిష్ యాంటెన్నా కేబుల్ అవసరం లేదు
- ఈ యాప్‌ను స్మార్ట్ టీవీ యాప్ స్టోర్ నుంచి నేరుగా డౌన్లోడ్
Tata Play Smart TV App : టాటా ప్లే కస్టమర్లకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో కొత్త టాటా ప్లే స్మార్ట్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ టీవీ స్ట్రీమింగ్ యాప్ కస్టమర్లకు 500కు పైగా లైవ్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా, ఈ యాప్‌ను డౌన్లోడ్ చేశాక మీ టీవీకి కేబుల్, డిష్ యాంటెన్నా, సెట్-టాప్ బాక్స్ అవసరం లేదు.
ఇతర వైర్‌ను కనెక్ట్ కూడా అక్కర్లేదు. ఈ యాప్ ద్వారా క్రీడలు, వార్తలు, సినిమాలు, టీవీ షోలు అనేక ఇతర రకాల కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్ ఇతర ఫీచర్లు ఏంటో వివరంగా చూద్దాం..
టాటా ప్లే స్మార్ట్ ధర :
టాటా ప్లే స్మార్ట్ నెలవారీ ప్లాన్లు రూ. 199 నుంచి ప్రారంభమవుతాయి. ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం తెలుగు వంటి భాషలకు సపోర్టు ఇస్తుంది. శాంసంగ్, ఆండ్రాయిడ్ టీవీ, విడా, గూగుల్ టీవీ ఫైర్ టీవీతో పాటు ఆండ్రాయిడ్ ఐఓఎస్ మొబైల్ ఫోన్లు టాబ్లెట్లలో అందుబాటులో ఉంది.
టాటా ప్లే స్మార్ట్ ఫీచర్లు :
టాటా ప్లే స్మార్ట్ కస్టమర్లు సెట్-టాప్ బాక్స్, డిష్ యాంటెన్నా వైర్ల వంటి ఇబ్బందుల నుంచి రిలీఫ్ పొందొచ్చు. వినియోగదారులు తమ స్మార్ట్ టీవీలోని యాప్ స్టోర్ నుంచి నేరుగా టాటా ప్లే స్మార్ట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read Also : 6 Best Yamaha Bikes : రూ. 2 లక్షల లోపు యమహా బైక్స్.. మైలేజ్, స్టైలింగ్, స్పీడ్.. మీకు ఏది సెట్ అవుతుంది?
అన్నింటికన్నా ముఖ్యంగా, ఈ యాప్‌ను డౌన్లోడ్ చేశాక మీరు డీటీహెచ్ సర్వీస్, కేబుల్ కనెక్షన్ లేదా మరే ఇతర పేమెంట్ టీవీ సర్వీస్‌ను వాడాల్సిన అవసరం ఉండదు. ఈ యాప్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా లైవ్ టీవీ యాక్సెస్‌ను అందిస్తుంది.
యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే.. వినియోగదారులు స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు ల్యాప్‌టాప్‌లలో కంటెంట్‌ను చూడొచ్చు. స్మార్ట్ టీవీలలో ఈ యాప్ ఛానల్ నంబర్లు, ప్రోగ్రామ్ గైడ్ రిమోట్‌కు కస్టమ్ కంట్రోలింగ్ అందిస్తుంది.
ప్రోగ్రామ్‌ను బట్టి కొన్ని ఛానెల్‌లు ప్రోగ్రామ్‌లు టెలిక్యాస్ట్ అయ్యాక క్యాచ్-అప్ వ్యూ కోసం అందుబాటులో ఉండవచ్చు. ఈ యాప్ సబ్స్క్రైబర్లకు వారు ఇష్టపడే భాషలో కంటెంట్‌ను చూడొచ్చు.


