
Anupama Parameswaran : హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కొన్ని రోజుల క్రితం ఓ తమిళ నటుడితో బ్రేకప్ అయి బాధపడి, ఓ ఇంటర్వ్యూలో కూడా దాని గురించి మాట్లాడి, కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం అనుపమ క్రేజీ కళ్యాణం సినిమాతో రాబోతుంది. ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు అనుపమ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.
Also Read : Shiva Jyothi : చీరలో సింపుల్ లుక్.. యాంకర్ శివజ్యోతి ఫోటోలు వైరల్..
ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇటీవల నరేష్ పెళ్లిళ్లు చేసుకోకపోయినా పిల్లల్ని కనండి అనే వ్యాఖ్యలపై తాజాగా అనుపమ స్పందిస్తూ.. ఆయన చెప్పింది నిజమే. నేను కూడా పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనాలని అనుకుంటున్నాను. దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. IVF ఉంది, అడాప్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. నాకు అయితే పెళ్లి ఆలోచన లేదు ఇప్పట్లో అని తెలిపింది. దీంతో అనుపమ కామెంట్స్ వైరల్ గా మారాయి.


