సీఎం జగన్ ను కలిసిన కొత్త సీఎస్
ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నిన్న బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ ఉదయం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సీఎస్ గా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి జవహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి. ఆయన సీఎం జగన్ కు ప్రత్యేక కార్యదర్శిగా కూడా పని చేశారు. మరోవైపు నిన్న సీఎస్ గా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నేతృత్వంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తానని చెప్పారు.
Share this article in your network!