ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బేబీ’
ముక్కోణపు ప్రేమ కథతో.. చిన్న సినిమాగా విడుదలై.. సెన్సేషనల్ హిట్ కొట్టింది ‘బేబీ’. యువతకు విపరీతంగా నచ్చేసిందీ సినిమా. దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది. సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా.. జులై 14న థియేటర్లలో విడుదలై 80 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది.
బేబీ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ‘ఆహా’ సంస్థ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 25 నుంచి తమ ప్లాట్‌ఫామ్‌పై సినిమా స్ట్రీమింగ్ మొదలు కానున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసింది. ‘ఆహా గోల్డ్’ సభ్యత్వం కలిగిన వాళ్లు ఈ సినిమాను 12 గంటల ముందే చూడొచ్చు. అంటే ఆగస్టు 24 సాయంత్రం 6 గంటల నుంచే గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు ‘బేబీ’ సినిమా అందుబాటులోకి రానుంది.
‘‘ఈ దశాబ్దపు కల్ట్ లవ్ స్టోరీని మరోసారి చూసేందుకు సిద్ధంకండి. ‘బేబీ’ మిమ్మల్ని ప్రేమలో పడేలా చేస్తుంది. కోపంతో కేకలు వేస్తుంది. అదే సమయంలో ఏడుస్తుంది. ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మీరు అప్పటివరకు వేచి ఉండలేకపోతే.. ఆహా గోల్డ్ సభ్యత్వం పొందండి. 12 గంటలు ముందుగానే సినిమాను చూడండి” అని ఆహా ట్వీట్ చేసింది.
Share this article in your network!