సంక్రాంతి తర్వాత తెలంగాణ లో ఆంక్షలు ?
పెరుగుతున్న కరోనా కేసుల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
అధికారుల నుంచి సీఎం కేసీఆర్ నివేదిక కోరారు. ప్రస్తుతం రోజుకు 2500 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత, నియంత్రణపై ఇవ్వాళ కేసీఆర్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో రానున్న మూడు వారాలు అత్యంత కీలకమని ప్రభుత్వం భావిస్తోంది.
కేసుల తీవ్రత, మరణాల సంఖ్య పెరిగితే ఆంక్షలు తప్పవు. అధికారులు చెబుతున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించవచ్చు. బార్లు, పబ్బులు, పాఠశాలలు, కళాశాలలు, మాల్స్, థియేటర్లపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
Share this article in your network!