పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా
పాన్ ఇండియా మూవీ "పుష్ప" మేనియా క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్, ప్రముఖ టీమిండియా క్రికెటర్లు శిఖర్ ధవన్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు తగ్గేదేలే అంటూ పుష్ప సినిమా పాటలు, డైలాగులతో ఇరగదీశారు.
తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా చేరాడు. పుష్ప సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ "చూపే బంగారమాయనే శ్రీవల్లి.." పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించాడు. రైనాతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా బన్నీ సాంగ్‌కు చిందేశారు. డేవిడ్ వార్నర్ కూడా స్టెప్పులేశాడు. దీనికి సంబంధించిన వీడియోను రైనా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. బన్నీపై ప్రశంసల వర్షం కురిపించాడు. పుష్ప సినిమాను చూశానని, అందులో అల్లు అర్జున్ నటన అద్భుంతంగా ఉందని కొనియాడాడు. బన్నీ మన్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ.. తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. రైనా చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. రైనా ఫ్యాన్స్‌తో పాటు బన్నీ అభిమానులు లైక్‌లు, కామెంట్లతో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు.
Share this article in your network!