తెలంగాణలో విద్యకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులు ప్రపంచస్థాయిలో ప్రతిభ కనబరిచేలా కేసీఆర్ కీలక పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో 12 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏకలవ్య మోడల్ స్కూల్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.
తెలంగాణ ఏర్పడకముందు 90 గురుకులాలు ఉంటే, ఇప్పుడు ఒక ట్రైబల్ వెల్ఫేర్ లోనే 183 గురుకుల పాఠశాలలు వున్నాయన్నారు. వాటన్నిటినీ జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడం జరిగిందన్నారు.