Saturday, June 6, 2026
Google search engine

చిల్కానగర్ ఉప్పల్ ప్రధాన రహదారి కల్వర్టు పనులు పూర్తి : కార్పొరేటర్ బన్నాల

Must read

చిల్కానగర్–ఉప్పల్ ప్రధాన రహదారిపై జరుగుతున్న బాక్స్ కల్వర్టు నిర్మాణ పనులను చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సుమారు ₹17 లక్షల వ్యయంతో కల్వర్టు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. బీరప్పగడ్డ, పరిసర కాలనీల నుంచి వచ్చే వర్షపు నీరు ఇరిగేషన్ నాలాలోకి వెళ్లేలా శాశ్వత పరిష్కారం కోసం ఈ కల్వర్టు ఏర్పాటు చేశామని వివరించారు. సుమారు నెల రోజులుగా పనులు కొనసాగుతున్నప్పటికీ, వర్షాభావం కారణంగా తరచూ వర్షం కురవడంతో కొంత ఆలస్యమై ప్రజలకు అసౌకర్యం కలిగిందని క్షమాపణ తెలిపారు.
పనులు పూర్తయ్యాక పది రోజుల క్యూరింగ్ ప్రక్రియలో భాగంగా మొదటి వారం రోజులు టూ వీలర్లకు అనుమతించి, మూడు రోజుల తర్వాత మొత్తం కల్వర్టును వాహనాల రాకపోకలకు పూర్తిగా తెరవాలని ఏఈ రాధికకు ఆదేశించినట్లు గీత ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ రాధిక, వర్క్ ఇన్‌స్పెక్టర్ కేదార్, శ్రీనగర్ కాలనీ అధ్యక్షులు, ఇతర కాలనీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!