200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ 16T.. లీకైన స్పెసిఫికేషన్లు చూస్తే మతిపోవాల్సిందే!

Must read

  • వన్‌ప్లస్ 16Tలో మీడియాటెక్ డైమెన్సిటీ 9600M ప్రాసెసర్‌
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.35-అంగుళాల ఫ్లాట్ LTPO OLED డిస్‌ప్లే
  • గత మార్చిలో చైనాలో వచ్చిన వన్‌ప్లస్ 15T‌కు అప్‌గ్రేడ్ వెర్షన్

OnePlus 16T Specifications : వన్‌ప్లస్ ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సరికొత్త వన్‌ప్లస్‌ ఫోన్ వచ్చేస్తోంది.. అదిరిపోయే పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే కెమెరాలు, అదిరిపోయే బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారు రెడీగా ఉండండి..

వన్‌ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్ రాబోతుంది.. అదే వన్‌ప్లస్ 16T ఫోన్.. ఇంకా కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు ముందుగానే ఆన్‌లైన్‌లో లీక్ అయి చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..

చిన్న ఫోన్.. పెద్ద ఫీచర్లు :
లీకుల ప్రకారం.. వన్‌ప్లస్ 16T కాంపాక్ట్ డిజైన్‌తో రానుంది. ఇందులో 6.35 అంగుళాల ఫ్లాట్ ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్ మరింత స్మూత్‌గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ 9600M చిప్‌సెట్‌ను ఇందులో వాడొచ్చనని అంచనా..

Read Also : 

కెమెరాల పరంగా తగ్గేదేలే :
ఈ ఫోన్‌లో కెమెరాలే మెయిన్ అట్రాక్షన్.. బ్యాక్ సైడ్ 200MP ప్రైమరీ కెమెరాతో పాటు OIS సపోర్ట్ ఉన్న 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండొచ్చని లీకుల అంచనా. అంటే ఫొటోగ్రఫీ ఇష్టపడేవారికి ఈ ఫోన్‌ చాలా అద్భుతంగా ఉంటుంది.

భారీ బ్యాటరీతో రాబోతోందా? :
బ్యాటరీ విషయంలోనూ వన్‌ప్లస్ మంచి ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. 7,000mAh లేదా ఆపై సామర్థ్యమున్న బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని సమాచారం. మెటల్ ఫ్రేమ్, ఆండ్రాయిడ్ 17 కూడా ఇందులో ఉండే ఛాన్స్ ఉంది.

ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ 15Tలో 6.32 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 7,500mAh బ్యాటరీ, 100W వైర్డ్ ఛార్జింగ్ ఉన్నాయి. అయితే, వన్‌ప్లస్ 16Tకు సంబంధించిన వివరాలన్నీ లీకులే.. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే ఫీచర్లతో వస్తే మాత్రం కాంపాక్ట్ ఫోన్ సెగ్మెంట్‌లో వన్‌ప్లస్ 16టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!