రూ.1కే 24 రోజుల వ్యాలిడిటీ.. BSNL అదిరిపోయే ఆఫర్.. రోజుకు 1GB డేటా కూడా!

Must read

  • జియో, ఎయిర్‌టెల్‌కు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్
  • రూపాయికే అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా బెనిఫిట్స్
  • బీఎస్ఎన్ఎల్ నుంచి రెండు అదిరిపోయే ప్లాన్లు..

BSNL Cheapest Plan : టెలికాం రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచుతున్న క్రమంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL మాత్రం తమ యూజర్లను ఆకట్టుకునే సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తోంది.

ఇందులో భాగంగా తీసుకొచ్చిన రూ.1 ఫ్రీడమ్ ఆఫర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రూపాయి ఖర్చుతోనే ఏకంగా 24 రోజుల పాటు (BSNL Cheapest Plan) మొబైల్ సేవలు పొందవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది? :
బీఎస్ఎన్ఎల్ అందించే ఈ స్పెషల్ ఆఫర్ అందరికీ వర్తించదు. ఇతర టెలికాం నెట్‌వర్క్‌ల నుంచి బీఎన్ఎన్ఎల్ లోకి కొత్తగా మారే వినియోగదారులకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్న వారు ఈ ఆఫర్‌కు అర్హులు కారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన ఈ ఫ్రీడమ్ ఆఫర్‌కు నవంబర్ 9 వరకు మాత్రమే గడువు ఉంది..

Read Also : 

రూ.1తో ఎలాంటి బెనిఫిట్స్? :
ఈ ప్లాన్‌లో 24 రోజుల వ్యాలిడిటీతో పాటు దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఫ్రీ నేషనల్ రోమింగ్ బెనిఫిట్ కూడా ఉంటుంది. రోజుకు 100 SMS, ప్రతిరోజూ 1GB డేటా పొందొచ్చు. తక్కువ ఖర్చుతో కొత్త నెట్‌వర్క్‌కు మారాలనుకునే వారికి ఈ ఆఫర్ ఆకర్షణీయంగా ఉంటుంది.

ఏడాది పాటు 3GB డేటా.. :
మరోవైపు లాంగ్ టైమ్ వ్యాలిడిటీ కోరుకునే వారికి రూ.2,799 వార్షిక ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 3GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS, ఫ్రీ రోమింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి.

మొత్తానికి తక్కువ ధరలో రీఛార్జ్ కోరుకునే వారితో పాటు ఏడాది పాటు ఒకేసారి రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ప్లాన్లు అద్భుతంగా ఉంటాయి. అయితే రూ.1కే ఆఫర్ వ్యాలిడిటీ, అర్హతలు, ప్రాంతాల వారీగా మారే అవకాశం ఉంది. రీఛార్జ్ చేసుకునే ముందు బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవడం బెటర్..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!