8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో కొత్త వివో Y32 5G వచ్చేసింది.. ధర జస్ట్ ఎంతంటే?

Must read

  • వివో Y32 5G ఫోన్ ఆండ్రాయిడ్ 6 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 16
  • 8,000mAh బ్యాటరీ, 6.87 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే
  • 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు, 120Hz రిఫ్రెష్ రేట్‌

Vivo Y32 5G Launch : వివో కొత్త 5G ఫోన్ వచ్చేసింది.. వివో Y32 5G ఎట్టకేలకు అధికారికంగా లాంచ్ అయింది. అయితే, కంపెనీ ఇంకా ధర, సేల్ తేదీని రివీల్ చేయలేదు.. వివో వై32 5జీ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8,000mAh బ్యాటరీతో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌ అందిస్తుంది. వివో Y32 5జీ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..

వివో Y32 5జీ ధర ఎంతంటే? :
వివో తైవాన్ అధికారిక వెబ్‌సైట్‌లో వివో వై32 5జీ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ లిస్టు అయింది. కంపెనీ ఇంకా ధర ఎంత అనేది రివీల్ చేయలేదు. ఈ వివో ఫోన్ డాన్ గోల్డ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది..

వివో Y32 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :

వివో Y32 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌ అందిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4వ జనరేషన్ 2 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 6GB LPDDR4X ర్యామ్, 128GB UFS2.2 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది..

Read Also : 

మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా ర్యామ్ 6GB వరకు, స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించవచ్చు. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 8,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. కొలతలు 169.55mm పొడవు, 79.20mm వెడల్పు, 8.79/8.69mm మందం, బరువు 229/230 గ్రాములు ఉంటుంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అమర్చారు.

ఈ వివో 5జీ ఫోన్ 1592 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.87-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 16.8 మిలియన్ రంగులు 255పీపీఐ పిక్సెల్ డెన్సిటీకి సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, డ్యూయల్-సిమ్ సపోర్ట్, వై-ఫై 5, ఇంటర్నెట్ కాలింగ్, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ 2.0, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ ఉన్నాయి.

వివో వై32 5జీ ఫోన్ రియర్ కెమెరా సెటప్‌లో ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.05 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లోని ఇతర సెన్సార్లలో గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, డిస్టెన్స్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, మోటార్ సెన్సార్ ఉన్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!