- లావా మొబైల్ కొనాలనుకుంటున్నారా?
- లావా ఫోన్లపై భారీ ధరల పెంపు
- లావా ఫోన్ల ధరలు పెరిగేది అప్పటి నుంచే
- పాత మోడళ్ల ధరలు కూడా పెరుగుతాయి
Lava Smartphone Prices : స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్.. ఇప్పటికే పెరుగుతున్న మొబైల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న యూజర్లకు మరో బ్యాడ్ న్యూస్.. ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) కూడా తన ఫోన్ల ధరలను భారీగా పెంచేందుకు రెడీ అయింది. నవంబర్ 15, 2026 నుంచి లావా స్మార్ట్ఫోన్లు కొత్త ధరలతో మార్కెట్లోకి రానున్నాయి. ఇంతకీ ఎంత పెరగనున్నాయి? ఏయే వివరాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
రూ.3వేల వరకు పెరగనున్న ధరలు :
లావా స్మార్ట్ఫోన్ల ధరలను గరిష్ఠంగా రూ.3వేల వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఫోన్ అరేనా రిపోర్టు ప్రకారం.. ఈ కొత్త ధరల పెంపు నవంబర్ 15, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న పాత స్టాక్ మాత్రం పాత ధరలకే లభించనుంది. లావా ఫోన్ కొనాలనుకునే నవంబర్ 15లోపు కొనుగోలు చేస్తే భారీగా డబ్బు ఆదా చేసుకోవచ్చు.
Read Also :
ధరల పెంపునకు కారణమేంటి? :
ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల ధరలు పెరగడం, వాటి సరఫరా తగ్గిపోవడం స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు అతిపెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితుల కారణంగా స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియో ధరలను సవరించాల్సి వస్తోందని లావా వెల్లడించింది. ఇప్పటికే వివో, శాంసంగ్, ఐక్యూ వంటి బ్రాండ్లు కూడా తమ ఫోన్ల ధరలను భారీగా పెంచాయి. ఇప్పుడు ఈ జాబితాలో లావా కూడా చేరింది.
లావా ఆరా కర్వ్ 5G స్పెసిఫికేషన్లు :
ఇటీవలే లావా ఆరా కర్వ్ 5Gని కంపెనీ ఆవిష్కరించింది. ఇందులో 6.67 అంగుళాల FHD+ 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ ఉన్నాయి. 6GB LPDDR5 ర్యామ్, 128GB స్టోరేజ్ అందించారు. కెమెరాల విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి..
అలాగే 6000mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మన్నిక కోసం Al-Si DT స్టార్ 2 కవర్ గ్లాస్, మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. సాఫ్ట్వేర్ పరంగా రెండేళ్ల OS అప్గ్రేడ్లు, మూడేళ్ల సెక్యూరిటీ అప్డేట్లు అందించనుంది.



