మురసు తుపాను ముప్పు.. ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!

Must read

  • మురసు తుపాను అలర్ట్..
  • బంగాళాఖాతంలో బలపడుతున్న మురసు..
  • ఏపీ వైపు దూసుకొస్తున్న మురసు..
  • 120 కి.మీ. వేగంతో గాలులు

Cyclone Murasu Alert : బంగాళాఖాతంలో మురసు తుపాను వేగంగా బలపడుతోంది. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల వైపు ఈ తుపాను దూసుకొస్తోంది.. దాంతో ఏపీలో భారీ వర్షాలు పడే సూచన కనిపిస్తోంది.. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

గత 6 గంటల్లో గంటకు 27 కిలోమీటర్ల వేగంతో కదిలిన మురసు తుపాను.. ప్రస్తుతం చెన్నైకి 480 కిలోమీటర్లు, నెల్లూరుకు 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు (సోమవారం) ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా.

అదే రోజు అర్ధరాత్రి నుంచి ఎల్లుండి (మంగళవారం) తెల్లవారుజాము మధ్య నెల్లూరు–నర్సాపురం మధ్య తీరం దాటే సూచనలు ఉన్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 100 కి.మీ నుంచి 110 కిలోమీటర్లు, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. సోమవారం మధ్యాహ్నం నుంచే కోస్తా తీరం వెంబడి గంటకు 80 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.

Read Also : 

జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు :

రానున్న 3 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు పడవచ్చు. సోమవారం కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఏలూరు, ఉభయ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చు.

మంగళవారం అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్ష సూచన ఉంది. బుధవారం కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చు.

రంగంలోకి సహాయక బృందాలు :
ముందస్తు చర్యల్లో భాగంగా 6 ఎన్డీఆర్‌ఎఫ్‌, 7 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రభుత్వం మోహరించింది. కృష్ణా, బాపట్ల, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచింది.

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచించింది. సమస్యలుంటే మనమిత్ర 9552300009 నంబర్‌ను సంప్రదించాలి. అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!