Vishwak Sen : నాకు ఎన్ని డబ్బులు ఆఫర్ చేసినా అలాంటి రోల్స్ చేయను.. విశ్వక్ సేన్ కామెంట్స్..

Must read

Vishwak Sen : వరుసగా మూడు సినిమాలతో ఫ్లాప్స్ చూసిన విశ్వక్ సేన్ ఇప్పుడు కల్ట్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో నటిస్తూనే డైరెక్షన్ కూడా చేసాడు. కల్ట్ సినిమా అక్టోబర్ 30న థియేటర్స్ లో రాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు విశ్వక్.

Also Read : Gautam Ghattamaneni : హీరో అవ్వక ముందే గౌతమ్‌కి యాంటీ ఫ్యాన్స్ తయారవుతున్నారా..? కొంతమంది మాత్రం పొగుడుతున్నారే..

మీకు గెస్ట్ రోల్స్ వచ్చాయంట, చేయలేదా అని హోస్ట్ అడగగా దానికి విశ్వక్ సేన్ స్పందిస్తూ.. నాకు గెస్ట్ రోల్స్ ఆఫర్స్ కొన్ని వచ్చాయి. నాకు చేయడానికి ప్రాబ్లమ్ లేదు. కానీ ఆ పాత్ర చచ్చిపోయే గెస్ట్ రోల్స్ అయితే చేయను. నాకు ఎంత డబ్బులు ఆఫర్ చేసినా, ఎంత పెద్ద సినిమా అయినా అందులో నా పాత్ర చనిపోతుంది అంటే గెస్ట్ రోల్ చేయను. ఒకవేళ నా సినిమాలో నా పాత్ర చనిపోతే ఓకే కానీ వేరే వాళ్ళ సినిమాలో చనిపోవడం నాకు నచ్చదు అని తెలిపారు. దీంతో చనిపోయే పాత్ర కాకుండా ఏదైనా పవర్ ఫుల్ గెస్ట్ రోల్ ఆఫర్ చేస్తే విశ్వక్ చేస్తాడని తెలుస్తుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!