Cyclone Arnab: వేగంగా దూసుకొస్తున్న ‘అర్నబ్’తుఫాన్.. ఏపీలో మొదలైన ముసురు.. కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్!

Must read

Cyclone Arnab: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ అతి తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాన్ గత ఆరు గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 170 కిలోమీటర్లు, కాకినాడకు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాన్ ప్రభావంతో ఇప్పటికే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, కోనసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి.

Telangana Ration Card: తెలంగాణ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇక సబ్సిడీపై నిత్యావసరాలు కూడా.. సర్కార్ సూపర్ ప్లాన్!

యానాం సమీపంలో రేపు ఉదయం తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు:

తుపాన్ తాజా కదలికల ప్రకారం బుధవారం ఉదయానికి బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో ‘అర్నబ్(Cyclone Arnab)’ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో తీరప్రాంతాల్లో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల చొప్పున విధ్వంసకర ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో సాయంత్రం నుంచి పోలవరం, కోనసీమ, కాకినాడ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

రెడ్ అలర్ట్ జారీ.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రఖర్ జైన్ హెచ్చరిక:

తుపాన్ తీవ్రత దృష్ట్యా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది. ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని స్పష్టం చేశారు. కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చామని, సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని అధికారులు వెల్లడించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!