Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం దర్శకుడిగా సినిమా.. వామ్మో.. ఆడియో రైట్స్‌‌కి అన్ని కోట్లు వచ్చాయా..? కమర్షియల్ హిట్ గ్యారెంటీ..

Must read

Kiran Abbavaram : హీరోగా వరుస విజయాలతో మెప్పిస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు దర్శకుడిగా మారాడు. మొదటి సారి దర్శకుడిగా మారి రియాలిటీ అనే సినిమాతో రాబోతున్నాడు. హీరోగా, దర్శకుడిగా రెండు బాధ్యతలను పర్ఫెక్ట్ గా నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, భజగోవిందం సాంగ్ బాగా వైరల్ అయ్యాయి. భజ గోవిందం సాంగ్ అయితే మిడిల్ క్లాస్ అందరికి కనెక్ట్ అయిపోయింది.

అయితే ఈ రియాలిటీ సినిమా ఆడియో రైట్స్ ఏకంగా 3.5 కోట్ల‌ రూపాయలకు అమ్ముడయ్యాయట. స‌రిగ‌మ‌ సంస్థ ఈ సినిమా ఆడియో రైట్స్ ని అంత భారీ మొత్తం ఇచ్చి కొనుగోలు చేసింది. మిడ్ రేంజ్ హీరోకి కేవలం ఆడియో రైట్స్ కి ఇంత ఇవ్వడం ఆశ్చర్యకరమే. ఇప్పటికే భజ గోవిందం పాటతోనే మంచి వ్యూస్ వచ్చాయి. ఇక ఈ సినిమాలో సూపర్ హిట్ డివోషనల్ సాంగ్ ర‌ఘుకుల తిల‌క రారా.. పాటని రీమిక్స్ చేయబోతున్నారట. అదే నిజం అయితే ఇరుముడిలో మల్లెపూల పల్లకి సాంగ్ కి వచ్చినంత రీచ్ రావడం గ్యారెంటీ. సాంగ్స్ అన్ని బాగుండటంతోనే కిరణ్ అబ్బవరం సినిమాకు ఈ రేంజ్ అమౌంట్ ఆఫర్ చేసి పాటలు కొనుక్కున్నారట.

Also See : Vijay Deverakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ అబుదాబి వీకెండ్.. శిఖ‌ర్ ధావ‌న్‌తో.. ఫోటోలు వైర‌ల్..

గత కొన్నాళ్లుగా కిరణ్ అబ్బవరం సినిమా అంటే సేఫ్ ప్రాజెక్టు అని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాకు కూడా ఆల్రెడీ ఓటీటీ రైట్స్ ఫైనల్ అయ్యయ్యని తెలుస్తుంది. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుందని ఆశిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25 రిలీజ్ కాబోతుంది. కమర్షియల్ గా అయితే రియాలిటీ సినిమా సేఫ్ ప్రాజెక్టు అని ఇండస్ట్రీ టాక్. దీంతో దర్శకుడిగా కిరణ్ అబ్బవరం రిలీజ్ కి ముందే సక్సెస్ చూసినట్టే. ఇక సినిమా రిలీజయి హిట్ కొడితే కిరణ్ ఫేమ్ మరింత పెరగడం ఖాయం.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!